Exercises : కాళ్లల్లో పెరుకుపోయిన కొవ్వు కరిగించే వ్యాయామాలు ఇవే…

జంపింగ్ రోప్స్ , స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా మోకాళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీరానికి చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది.

Exercises : కాళ్లల్లో పెరుకుపోయిన కొవ్వు కరిగించే వ్యాయామాలు ఇవే…

Legs Fat

Exercises : ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఒక అరగంటైనా వ్యాయామం అవసరం. ముఖ్యంగా వాకింగ్, జాగింగ్ లేదా రన్నింగ్ ఇలా ఏదైనా సరే శరీరానికి మేలు చేస్తుంది. జిమ్ములో కసరత్తులు చేయడం కంటే జాగింగ్ చేస్తే శరీరం మొత్తానికి మంచి వ్యాయామం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో స‌హ‌జంగానే అనేక చోట్ల కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంటుంది. అందువ‌ల్ల ఒక్కో భాగానికి వ్యాయామం అవ‌స‌రం అవుతుంది. మ‌నం చేసే భిన్న ర‌కాల వ్యాయామాలు మ‌న శ‌రీరంలోని కొవ్వును క‌రిగించేందుకు స‌హాయ ప‌డ‌తాయి. కాళ్ల ల్లో వివిధ ప్రాంతాల్లో సైతం కొవ్వు చేరుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా జ‌ర‌గ‌కుండా ఉండాల‌న్నా, కాళ్లలో చేరిన కొవ్వును క‌రిగించాల‌ంటే కొన్ని వ్యాయామాలు రోజు వారిగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ముఖ్యంగా రన్నింగ్, జాగింగ్ ఏది చేస్తే కాళ్లల్లో కొవ్వును క‌రిగిస్తుంది. ఇలా చేయటం వల్ల కాళ్ల కండ‌రాలు చ‌క్క‌ని ఆకృతిని పొందుతాయి. ఈ వ్యాయామాల వ‌ల్ల మోకాళ్ల వ‌ద్ద ఉండే కొవ్వు కూడా క‌రుగుతుంది. గుంజీలు తీయ‌డం అనేది చాలా మంచి ఎక్స‌ర్‌సైజ్. దీంతో చ‌క్క‌ని వ్యాయామం జ‌రుగుతుంది. ఇది మోకాళ్ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. కాళ్ల భాగంలో ఉండే కొవ్వును క‌రిగిస్తుంది. అందుక‌ని రోజూ కొంత స‌మయం పాటు గుంజీలు తీయాలి. రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. ముఖ్యంగా న‌డుం కింది భాగంలోని అవ‌య‌వాల‌కు చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది. కండ‌రాలు చ‌క్క‌ని ఆకృతిని పొందుతాయి. వాకింగ్ ఎంతో సుల‌భ‌మైంది. వృద్ధులు కూడా దీన్ని రోజూ చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల మోకాళ్ల వ‌ద్ద ఉండే కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నొప్పులు త‌గ్గుతాయి.

ప్రమాదనంగా మోకాళ్లల్లో ఏర్పడే కొవ్వును కరిగించేందుకు సులభమైన వ్యాయామం బాగా ఉపకరిస్తుంది అదేంటంటే ఒక మోకాలిని వంచి రెండో మోకాలుని నేల‌పై ఉంచాలి. త‌రువాత ఇంకో కాలుతో కూడా ఇలా చేయాలి. ఈ వ్యాయామాన్ని లంగెస్ అంటారు. దీని వ‌ల్ల కూడా మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మోకాళ్ల వద్ద ఉండే  కొవ్వు సైతం శులభంగా కరిగిపోతుంది.

జంపింగ్ రోప్స్ , స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా మోకాళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీరానికి చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది. మోకాళ్లు స‌హా న‌డుం కింది భాగంలో ఉండే అన్ని అవ‌యవాల‌కు చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది. ఆయా భాగాల్లోని కొవ్వు క‌రుగుతుంది. నొప్పులు త‌గ్గుతాయి. వ్యాయామం, జాగింగ్ చేయడం వల్ల మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. రోజూ కనీసం 30 నిమిషాల నుంచి 90 నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కాళ్లల్లో నిల్వవున్న అనవసరమైన కొవ్వులన్నీ కరిగిపోతాయి. వాకింగ్ వల్ల కేవలం బరువు మాత్రమే కాదు.. మధుమేహం, గుండె జబ్బులు తదితర వ్యాధుల ముప్పు నుంచి కూడా బయటపడతారు.