Vijay Devarakonda : అభిమానులకి వరాలు కురిపించిన విజయ్ దేవరకొండ

తాజాగా దసరా సందర్భంగా నిన్న రాత్రి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ ఇంటరాక్షన్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు వరాలు కురిపించాడు. ఎవరు ఏం అడిగినా ఓకే చెప్పి విజయ్

Vijay Devarakonda :  అభిమానులకి వరాలు కురిపించిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda :  ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ హీరో అయిపోయి తర్వాత సినిమాలకి రిజల్ట్ తో సంబంధం లేకుండా ఫుల్ ఫామ్ లో ఉంటున్నాడు విజయ్. త్వరలో ‘లైగర్’తో పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్నాడు. విజయ్ సినిమాలు, బిజినెస్ లు, యాడ్స్ తో ఫుల్ బిజీగా ఉంటాడు. అప్పుడప్పుడు ఖాళీ దొరికితే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడు. అభిమానులతో మాట్లాడతాడు కూడా. తాజాగా దసరా సందర్భంగా నిన్న రాత్రి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు.

ఈ ఇంటరాక్షన్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు వరాలు కురిపించాడు. ఎవరు ఏం అడిగినా ఓకే చెప్పి విజయ్ దేవరకొండ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అభిమానులు వాళ్ళ హీరో మాట్లాడితే చాలు, రిప్లై ఇస్తే చాలు, ఒక ఫోటో దిగితే చాలు అనుకుంటారు. అలాంటిది ఏకంగా ఫ్యాన్స్ ట్వీట్స్ కు రిప్లై ఇస్తూ, వాళ్లు అడిగిన కోరికలు నెరవేరుస్తానని ప్రామిస్ చేయడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో అందరి కంటే వరస్ట్ ఎవరు??

ఒక అభిమాని నీతో కలిసి లంచ్ చేయాలి అని ఉంది అంటే అతని ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాడు విజయ్. నీతో ‘లైగర్’ మూవీ చూడాలని అడిగిన మరో అభిమానికి నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో థియేటర్ లో లైగర్ మూవీ చూద్దామని చెప్పి షాక్ ఇచ్చాడు. మరో అభిమానికి విజయ్ దేవరకొండ ఇటీవల ప్రారంభించిన ఏవీడీ మల్టీప్లెక్స్ లో ఏడాదిపాటు ఏ సినిమా అయినా చూసేందుకు టికెట్ ఫ్రీ అని చెప్పి అతన్ని ఆశ్చర్యపరిచాడు. మన రౌడీ గ్యాంగ్ అందరితో కలిసి ‘లైగర్’ మూవీ చూద్దామని మరికొందరు అభిమానులకు చెప్పి వాళ్ళకి ఫుల్ ఆనందాన్ని ఇచ్చాడు విజయ్. మరో అభిమాని ప్రభాస్ ను కలిపించండి అని కోరగా దానికి కూడా ఓకే చెప్పాడు. ఇలా చాలా మందికి వరాలు ఇచ్చి అభిమానుల్ని ఖుషి చేశాడు అర్జున్ రెడ్డి.