Balakrishna : బాలయ్య బాబు కొత్త లుక్.. ఆహా కోసం సరికొత్తగా.. బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ అంట..

తాజాగా ఆహా నుంచి బాలయ్య బాబు తరపున మరో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ రాబోతుంది అని ప్రకటించారు ఆహా ఓటీటీ నిర్వాహకులు. ఓ సరికొత్త టోపీ ధరించి వెనక నుంచి బాలకృష్ణ ఫోటోని ఆహా నిర్వాకులు పోస్ట్ చేసి..............

Balakrishna :  బాలయ్య బాబు కొత్త లుక్.. ఆహా కోసం సరికొత్తగా.. బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ అంట..

Balakrishna :  బాలయ్య బాబు గత సంవత్సరం నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ సినిమా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడం, అన్‌స్టాపబుల్ అంటూ ఆహాలో సరికొత్త షోతో మరింత కొత్తగా కనపడి ఆ షో కూడా హిట్ అవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా బాలయ్యని ఇలాగే చూడాలని అనుకుంటున్నాము అంటున్నారు.

ఇటీవలే అన్‌స్టాపబుల్ సీజన్ 2 రాబోతుందని ప్రకటించి ఆ షో మీద మరిన్ని హైప్స్ పెంచారు. అన్‌స్టాపబుల్ యాంతం అంటూ ఓ ర్యాప్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయడంతో బాలయ్య అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా కొత్త సీజన్ ఎప్పుడొస్తుంది, సెలబ్రిటీలు ఎవరెవరు వస్తారు అని ఎదురు చూస్తున్నారు.

Bigg Boss 6 Day 26 : ఈ వారం కొత్త కెప్టెన్.. వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసా.. అస్సలు ఊహించరు..

తాజాగా ఆహా నుంచి బాలయ్య బాబు తరపున మరో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ రాబోతుంది అని ప్రకటించారు ఆహా ఓటీటీ నిర్వాహకులు. ఓ సరికొత్త టోపీ ధరించి వెనక నుంచి బాలకృష్ణ ఫోటోని ఆహా నిర్వాకులు పోస్ట్ చేసి.. ”నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరంలో అతిపెద్ద ఆశ్చర్యంతో మునుపెన్నడూ చూడని అవతారంలోకి వచ్చారు. అత్యంత క్రేజీ ట్రైలర్ మరో 4 రోజుల్లో ఆహాలో రాబోతుంది” అని తెలిపారు. దీంతో ఈ సారి ఇంకే కొత్త ప్రాజెక్టుతో బాలయ్య బాబు రాబోతున్నారు అంటూ తెగ ఆలోచిస్తున్నారు. మరోసారి అభిమానులు ఫుల్ ఫిదా అవ్వడం ఖాయం అంటున్నారు. అక్టోబర్ 4వ తేదీన ఈ ట్రైలర్ రాబోతుందని ప్రకటించారు. మరి ఇది కొత్త సినిమానా, షోనా, సిరీస్, లేదా అన్‌స్టాపబుల్ సీజన్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారా అని అందరు వెయిట్ చేస్తున్నారు.