Aa Ammayi Gurinchi Meeku Cheppali: “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.. సినిమా కాదు షార్ట్ సిరీస్ అంటున్న మూవీ మేకర్స్!

యంగ్ హీరో సుధీర్ బాబు తన విభిన్నమైన కథల ఎంపికతో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మూవీ మేకర్స్ ఈ సినిమాని...

Aa Ammayi Gurinchi Meeku Cheppali: “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.. సినిమా కాదు షార్ట్ సిరీస్ అంటున్న మూవీ మేకర్స్!

Aa Ammayi Gurinchi Meeku Cheppali New Type of Promotions

Aa Ammayi Gurinchi Meeku Cheppali: యంగ్ హీరో సుధీర్ బాబు తన విభిన్నమైన కథల ఎంపికతో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరు ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాలతో ప్రేక్షకులని అలరించగా, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ మనముందుకు రాబోతుంది.

Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event : ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

ఈ సినిమాను సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా, మొన్ననే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు. కాగా మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేలా సరికొత్త ప్రమోషన్స్ కు తెర లేపారు. సినిమా విడుదలకు ముందే హీరో, హీరోయిన్ కలిసి నటించిన ఒక 3 ఎపిసోడ్స్ షార్ట్ సిరీస్ ని చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది.

‘ది మిస్సడ్ కాల్’, ‘ది చాట్’, ‘ది మీట్’ అంటూ మూడు ఎపిసోడ్ లను మూవీ టీం యూట్యూబ్ లో విడుదల చేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోస్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో సుధీర్ బాబుకి జంటగా అందాల భామ కృతి శెట్టి నటిస్తుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సుధీర్-ఇంద్రగంటిల కాంబినేషన్ ఈసారి ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి.