Shahrukh Khan in Laal Singh Chaddha : లాల్ సింగ్ చడ్డాలో షారుఖ్.. సీక్రెట్ బయటపెట్టేసిన అమీర్..

తాజాగా ఈ సినిమాలో ఉన్న మరో సీక్రెట్ ని బయటపెట్టేసి సినిమాపై మరింత హైప్ ని పెంచారు అమీర్ ఖాన్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.............

Shahrukh Khan in Laal Singh Chaddha : లాల్ సింగ్ చడ్డాలో షారుఖ్.. సీక్రెట్ బయటపెట్టేసిన అమీర్..

 

Shahrukh Khan in Laal Singh Chaddha :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా ప్రమోషన్స్ లో బిజిబిజిగా ఉన్నారు. ఎన్నడూ లేనిది ఈ సారి తానే డైరెక్ట్ గా దిగి హిందీ, తెలుగు ప్రమోషన్స్ లో భాగమవుతున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తుండటంతో తెలుగు మార్కెట్ మీద కూడా బాగా ఫోకస్ చేసి ప్రమోషన్స్ చేస్తున్నారు అమీర్. ఇక ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Meena : భర్త చనిపోయాక మొదటిసారి.. అలనాటి తారలతో కలిసి మీనా ఇలా..

తాజాగా ఈ సినిమాలో ఉన్న మరో సీక్రెట్ ని బయటపెట్టేసి సినిమాపై మరింత హైప్ ని పెంచారు అమీర్ ఖాన్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ”లాల్ సింగ్ చడ్డాలో ఓ కీలక పాత్ర కోసం నా మిత్రుడు షారుఖ్ ని కలిశాను. షారుఖ్ చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇది అతిథి పాత్ర అయినా షారుఖ్ స్థాయికి తగినట్లు ఉంటుంది” అని తెలిపాడు. దీంతో ఈ సినిమాలో షారుఖ్ కూడా నటిస్తున్నాడు అని తెలియడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. షారుఖ్ కూడా ఉన్నాడు అని తెలియడంతో బాలీవుడ్ ప్రేక్షకులు, షారుఖ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.