Hit 2 : శ్రద్ధా వాకర్‌ హత్య కేసే హిట్ 2 స్టోరీనా? అడివి శేష్ ఏం చెప్పాడు??

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అడవిశేష్ సినిమా గురించి పలు విషయాలు మాట్లాడారు. అయితే ఈ సినిమాలో ఒక అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలుగా నరుకుతారు. హంతకుడు ఎవరు, ఎలా పట్టుకుంటారు అన్నదే కథ అని...........

Hit 2 : శ్రద్ధా వాకర్‌ హత్య కేసే హిట్ 2 స్టోరీనా? అడివి శేష్ ఏం చెప్పాడు??

Adivi Sesh about case in Hit 2 Movie

Hit 2 :  నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా హిట్ 2 సినిమా రాబోతుంది. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అడవిశేష్ సినిమా గురించి పలు విషయాలు మాట్లాడారు. అయితే ఈ సినిమాలో ఒక అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలుగా నరుకుతారు. హంతకుడు ఎవరు, ఎలా పట్టుకుంటారు అన్నదే కథ అని ట్రైలర్ చూసిన వారికి అర్ధమవుతుంది. అయితే ఇటీవల నోయిడాలో శ్రద్ధా వాకర్‌ అనే అమ్మాయిని హత్య చేసి ఇలాగే ముక్కలు ముక్కలుగా నరికాడు అఫ్తాబ్ అనే ఓ వ్యక్తి. ప్రస్తుతం అఫ్తాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

Adivi Sesh : హిట్ 2 త్వరలో హిందీలో కూడా.. అడివి శేష్ మరో పాన్ ఇండియా సినిమా..

హిట్ 2 ట్రైలర్ లో కూడా హత్యకి గురైన అమ్మాయి పేరు శ్రద్ధా కావడం, కేసు కూడా అలాగే ఉండటంతో ఈ రెండిటిని పోలుస్తూ ఇంటర్వ్యూలో అడివి శేష్ ని ప్రశ్నించారు. దీనికి అడివి శేష్ సమాధానమిస్తూ.. ”హిట్ 2 సినిమాలో అమ్మాయి పేరు శ్రద్ధ అని ఉండటం, నోయిడాలో హత్య అయిన అమ్మాయి పేరు కూడా శ్రద్ద అవ్వడం, మా సినిమాలో కేసు కూడా అలాగే ఉండటం ఇదంతా అనుకోకుండానే జరిగింది. శ్రద్ధా వాకర్‌ సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. కానీ దర్శకుడు శైలేష్ ఈ కథని సంవత్సరం క్రితమే తయారు చేశాడు. అలాంటి సంఘటనలని మేము తీసుకోలేదు, అలాంటివి జరగాలని కూడా అనుకోము. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది మాత్రమే” అని తెలిపాడు.