Allu Arjun : పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నాను అయినా.. శ్రీ విష్ణు కోసమే ఈవెంట్ కి వచ్చాను.. పుష్ప 2 తగ్గేదేలే..

ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''ఈ ఫంక్షన్ కి వచ్చి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన మీ అందరికి థ్యాంక్యూ. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు ఆర్మీ ఉంది. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులకి థ్యాంక్యూ...............

Allu Arjun : పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నాను అయినా.. శ్రీ విష్ణు కోసమే ఈవెంట్ కి వచ్చాను.. పుష్ప 2 తగ్గేదేలే..

Allu Arjun speech in Alluri Movie Pre Release Event

Allu Arjun :  శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మొదటిసారి ఫుల్ మాస్ యాక్షన్ సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నాడు శ్రీ విష్ణు. ఆదివారం సాయంత్రం అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అల్లు అర్జున్ దీనికి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ”ఈ ఫంక్షన్ కి వచ్చి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన మీ అందరికి థ్యాంక్యూ. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు ఆర్మీ ఉంది. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులకి థ్యాంక్యూ. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ సినిమాలు ప్రేమ ఇష్క్ కాదల్ నుంచి మొన్న హుషారు వరకు అన్ని సినిమాలు చూశాను. శ్రీవిష్ణు గారంటే నాకు ప్రత్యేక అభిమానం. ఆయన మొదటి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్ చూసిన తర్వాత పిలిచి మాట్లాడాను. ఆయన అన్ని సినిమాలు చూస్తాను. శ్రీ విష్ణుకి కథల సెలెక్షన్ లో మంచి టేస్ట్ ఉంది. అయన సినిమాల ఫలితం ఎలా ఉన్నా సినిమా కంటెంట్ మాత్రం బాగుంటుంది. సినిమా కోసం ఆయన బాగా తపన పడతారు, కష్టపడతారు. విష్ణు జర్నీ ఎప్పుడూ మంచి సినిమాలు తీస్తూ ఉండాలి.”

BiggBoss 6 Day 14 : మరో ఎలిమినేషన్.. సండే తమన్నా స్పెషల్ ఎపిసోడ్..

”నేను పుష్ప 2 సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్నాను. అసలు బయట ఈవెంట్స్ కి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ శ్రీ విష్ణు నాకు చాలా ఏళ్ల పరిచయం. అప్పట్నుంచి నన్ను ఏమి అడగలేదు. కానీ ఈ సినిమా కోసం నా దగ్గరికి వచ్చి ఇలా ఈవెంట్ ఉంది, మీరే అంటారు నా సినిమా నేను సరిగ్గా పబ్లిసిటీ చేసుకోను అని, ఈ సినిమా చాలా మంచి సినిమా దీన్ని బాగా పుష్ చేద్దాం అనుకుంటున్నా. మీరు వస్తే ఇంకా హెల్ప్ అవుతుంది అని అన్నాడు. నాకు అనిపించింది శ్రీ విష్ణు బాగా కష్టపడతాడు, వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను. శ్రీ విష్ణు నా మనసుకి నచ్చిన వ్యక్తి. శ్రీ విష్ణు కోసమే వచ్చాను ఇక్కడికి.”

”నా ఆర్మీ అందరికి లవ్ యు. పుష్ప తర్వాత ఫస్ట్ టైం ఇలా ఈవెంట్ కి వచ్చాను భయమేసింది, మీరున్నారని. ఇప్పుడున్న ట్రెండ్ ఒకటే.. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు.. కంటెంట్ బాగుంటే, మంచి సినిమా అయితే జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మంచి ట్రెండ్ లో ఉన్నాము. మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ కి వస్తారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఇక పుష్ప 2 తగ్గేదేలే” అని మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా పుష్ప 2 సినిమా నాగురించి కూడా మాట్లాడుతూ ఆ సినిమాకి హైప్ ఇచ్చారు.