Allu Arjun : న్యూయార్క్ మేయర్‌తో తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. అమెరికాలో బన్నీ సందడి..

న్యూయార్క్ లో భారతదేశ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్నాడు బన్నీ. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ న్యూయార్క్ మేయర్ ని కలిసాడు. న్యూయార్క్ మేయర్ మరియు అక్కడి రాజకీయ ప్రతినిధులు అల్లు అర్జున్ ని పొగుడుతూ...........

Allu Arjun : న్యూయార్క్ మేయర్‌తో తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. అమెరికాలో బన్నీ సందడి..

allu arjun with newyork mayor

Allu Arjun :  పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి క్రేజ్ బాగా పెరిగింది. దేశ విదేశాల్లో కూడా ఈ సినిమాలోని పాటలు, తగ్గేదేలే అంటూ బన్నీ ఇచ్చిన మేనరిజం బాగా పాపులర్ అయ్యాయి. తాజాగా అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్ లోని ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్’ ఇండియా డే పరేడ్ నిర్వహించింది. న్యూయార్క్ లో నిర్వహించిన ఈ పరేడ్ కి కొన్ని లక్షల మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ పరేడ్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వెళ్లారు. అల్లు అర్జున్ కి న్యూయార్క్ వీధుల్లో భారీ స్వాగతం లభించింది.

న్యూయార్క్ లో భారతదేశ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్నాడు బన్నీ. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ న్యూయార్క్ మేయర్ ని కలిసాడు. న్యూయార్క్ మేయర్ మరియు అక్కడి రాజకీయ ప్రతినిధులు అల్లు అర్జున్ ని పొగుడుతూ రాసిన ఓ సన్మాన పత్రాన్ని బన్నీకి బహుకరించారు. ఫొటోలకి ఫోజులిస్తూ బన్నీతో కలిసి న్యూయార్క్ మేయర్, ఇతరులు ‘తగ్గేదే లే’ అంటూ స్టిల్స్ ఇచ్చారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Allu Arjun in America : అమెరికాలో భారత స్వతంత్ర వేడుకలకు గెస్టుగా అల్లు అర్జున్..

ఈ ఫోటోలని అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ”న్యూయార్క్ మేయర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా స్పోర్టివ్ జెంటిల్ మెన్. నన్ను సన్మానించినందుకు మేయర్ ఎరిక్ అడమ్స్ కు ధన్యవాదాలు” అని ట్వీట్ చేశారు.