Arpita Khan : 10 కోట్లతో లగ్జరీ ప్లాట్‌ని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ సోదరి

తాజాగా సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ కూడా భారీ ఖర్చు పెట్టి ఒక ప్లాట్ ని కొనుక్కుంది. అర్పిత ఖాన్‌ ముంబైలోని ఓ భవంతిలో 12వ అంతస్తులో ఉన్న లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది........

Arpita Khan :  10 కోట్లతో లగ్జరీ ప్లాట్‌ని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ సోదరి

Arpita

Arpita Khan :   ఇటీవల బాలీవుడ్ యాక్టర్స్ ఇళ్ళు, స్థలాలు, ప్లాట్లు కొంటున్నారు. వీటి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. ముంబైలో జుహు లాంటి అత్యంత ఖరీదైన ప్రదేశాల్లో ఇవి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ కాజోల్ 12 కోట్లతో రెండు ప్లాట్లను కొనుగోలు చేసింది. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ కూడా భారీ ఖర్చు పెట్టి ఒక ప్లాట్ ని కొనుక్కుంది.

సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్‌ నటుడు ఆయుశ్‌ శర్మతో కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేసింది. 2014లో హైదరాబాద్‌లోని ఫలక్‌నామా ప్యాలెస్‌లోనే వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆయుష్ శర్మ సినిమాలతో బిజీగా ఉంటే అర్పిత బిజినెస్ లతో బిజీగా ఉంది.

Kajol : 12 కోట్లతో రెండు ప్లాట్లు కొనుగోలు చేసిన కాజోల్‌.. 

అర్పిత ఖాన్‌ తాజాగా ముంబైలోని ఓ భవంతిలో 12వ అంతస్తులో ఉన్న లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. 1750 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఈ ప్లాట్ కోసం అర్పిత ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టింది. 10 కోట్లతో ఈ ప్లాట్ ని కొనుగోలు చేసింది. రిజిస్ట్రేషన్‌లో భాగంగా స్టాంప్‌డ్యూటీ కింద 40 లక్షలు చెల్లించింది అర్పిత. దీంతో అర్పిత సల్మాన్ ఖాన్ సోదరి అనిపించుకుంది. ఇంటి కోసం ఈ రేంజ్ లో ఖర్చుపెట్టి షాకిచ్చింది అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.