Avatar 2 : ఇండియాలో RRR, KGF రికార్డులను కొల్లగొట్టిన అవతార్..

వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నది 'అవతార్-2' ఎప్పుడెప్పుడు చూస్తామా అని. అయితే ఆ సమయం రానే వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా నేడు రికార్డు స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఏళ్ళ పాటు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఈ సినిమాని విజువల్ వండర్ గా మలిచేందుకు శ్రమించి, అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇచ్చేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

Avatar 2 : ఇండియాలో RRR, KGF రికార్డులను కొల్లగొట్టిన అవతార్..

Avatar 2 defeat RRR KGF records

Avatar 2 : వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నది ‘అవతార్-2’ ఎప్పుడెప్పుడు చూస్తామా అని. అయితే ఆ సమయం రానే వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా నేడు రికార్డు స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఏళ్ళ పాటు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఈ సినిమాని విజువల్ వండర్ గా మలిచేందుకు శ్రమించి, అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇచ్చేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

Avatar 2: ఆన్‭లైన్‭లో అవతార్-2 ఫుల్ మూవీ.. విజువల్ వండర్‌కు పైరసీ ఎఫెక్ట్!

2009లో విడుదలైన అవతార్-1 చిత్రంలో అంతరిక్ష అందాలని కళ్ళకు కట్టినట్లు చూపించిన కామెరాన్ ఈసారి సముద్ర గర్భ అందాలని చూపించేందుకు సిద్దమయ్యాడు. దాదాపు 160 దేశాల్లో 52000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇక భారత్ లో అయితే ఈ మూవీని థియేటర్ లో చూసేందుకు సినీ అభిమానులు ఎగపడుతున్నారు.

ఎంతలా అంటే రిలీజ్ కి ఒకరోజు ముందే అవతార్ సినిమా పైరసీ రూపంలో ఆన్‌లైన్‌లోకి వచ్చేసిన అభిమానులు అది చూసేందుకు ఇష్టపడడం లేదు. ఎందుకంటే అవతార్ చూసేదే ఆ విజువల ఎఫెక్ట్స్ కోసం, అది కేవలం థియేటర్ లోనే ఎక్స్‌పీరెన్స్ చేయగలం అంటున్నారు. దీంతో భారత్ లో అద్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదు కావడంతో RRR, KGF రికార్డులు కనుమరుగయ్యాయి.

ఆర్ఆర్ఆర్‌కి 1,05,000, హిందీ దృశ్యం-2కి 1,16,000, బ్రహ్మస్త్రకి 3,02,000, కేజీఎఫ్-2కి 4,11,000 మంది టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ చేసుకోగా.. భారత్ లో అవతార్-2కి 5లక్షల మంది పైగా అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకున్నారు. దీంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ భారత్‌లో కనీసం రూ.30-40 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 1000 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కి సిద్దమయ్యి రికార్డు సృష్టిస్తుంది.