Balakrishna : జైలర్ సీక్వెల్.. ఈ సారి మాత్రం బాలయ్య పక్కా ఉండాల్సిందే..

జైలర్ ఫస్ట్ వర్షన్‌లోనే బాలయ్యతో ఓ పాత్ర చేయించాలని చూసిన నెల్సన్ సరైన హోంవర్క్ లేక అది సాధ్యం కాలేదని బహిరంగంగా చెప్పాడు. ఫస్ట్ వర్సన్‌లో బాలయ్య లేని లోటును సీక్వెల్‌లో ప్రవేశపెట్టి తీర్చుకోవాలని చూస్తున్నాడు నెల్సన్.

Balakrishna : జైలర్ సీక్వెల్.. ఈ సారి మాత్రం బాలయ్య పక్కా ఉండాల్సిందే..

Balakrishna must play a key role in Jailer sequel Movie Director Nelson Dileep Kumar Planning Bigger

Balakrishna :  జైలర్(Jailer) సినిమా సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్న దర్శకుడు నెల్సన్(Nelson) నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ప్రత్యేక పాత్రను డిజైన్ చేస్తున్నాడట. జైలర్ ఫస్ట్ వర్షన్‌లోనే బాలయ్యతో ఓ పాత్ర చేయించాలని చూసిన నెల్సన్ సరైన హోంవర్క్ లేక అది సాధ్యం కాలేదని బహిరంగంగా చెప్పాడు. ఫస్ట్ వర్సన్‌లో బాలయ్య లేని లోటును సీక్వెల్‌లో ప్రవేశపెట్టి తీర్చుకోవాలని చూస్తున్నాడు నెల్సన్. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో జైలర్ సీక్వెల్‌పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గత నెలలో రిలీజై మంచి హిట్ కొట్టిన చిత్రం జైలర్. చాలా కాలం తర్వాత తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు(Rajinikanth) సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది జైలర్. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు అదరగొట్టేసింది జైలర్ మూవీ. ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజనీ యాక్షన్‌తోపాటు ప్రముఖ నటులు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా గెస్ట్ అప్పీరియన్స్‌లో కనిపించడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్యని కూడా గెస్ట్ అప్పీరెన్స్ అనుకున్నాను కానీ కుదరలేదు అని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో వీరిద్దరితో పాటు బాలయ్య కూడా ఉండివుంటే ఎంతో బావుండేదని ప్రేక్షకులు, అభిమానులు అనుకున్నారు.

Anirudh : అనిరుధ్‌కి కూడా కాస్ట్‌లీ కారు గిఫ్టుగా ఇచ్చిన జైలర్ నిర్మాత.. కారుతో పాటు..

దర్శకుడు నెల్సన్ కూడా బాలయ్య పాత్ర కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు గతంలో ప్రకటించగా ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో జైలర్ సీక్వెల్‌లో బాలయ్య కోసం ప్రత్యేక పాత్ర రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే జైలర్ సీక్వెల్‌లో బాలయ్యది పూర్తి నిడివి పాత్ర పోషిస్తారా? లేక గెస్ట్ రోల్‌కే పరిమితమవుతారా? అన్నది మాత్రం తెలియదు. ప్రస్తుతానికి ఈ సమాచారం టాలీవుడ్, కోలీవుడ్‌ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. అసలు సీక్వెల్ ఎప్పుడు ఉంటుందో కూడా చెప్పలేదు నెల్సన్. సీక్వెల్ ఉంటె మాత్రం బాలయ్య కచ్చితంగా అందులో కనిపిస్తారని ఇండస్ట్రీ టాక్.