Balakrishna : బింబిసారపై బాలయ్య ప్రశంశలు.. ఇలాంటివి నందమూరి వంశానికే దక్కుతాయి.. డైరెక్టర్ కి బాలయ్య సినిమా ఛాన్స్..

డైరెక్టర్ వశిష్ఠని ఉద్దేశించి.. సినిమా బాగా చేశావు, త్వరలో మనం సినిమా చేద్దాం. నీలాంటి యంగ్ స్టర్స్ రావాలి. మెల్లి మెల్లిగా కాకుండా మొదటిసారే ఇంత పెద్ద సినిమా బాగా చేశావు. ఇలాంటి అవకాశం ఇవ్వడం మా నందమూరి వంశానికే..........

Balakrishna : బింబిసారపై బాలయ్య ప్రశంశలు.. ఇలాంటివి నందమూరి వంశానికే దక్కుతాయి.. డైరెక్టర్ కి బాలయ్య సినిమా ఛాన్స్..

balakrishna

Balakrishna :  కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన బింబిసార సినిమా మంచి విజయం సాధించింది. సినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతున్నా ఇంకా థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారు. సినిమాపై ప్రేక్షకులే కాక ప్రముఖులు కూడా ప్రశంశలు కురిపిస్తున్నారు, చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు. తాజాగా నందమూరి కుటుంబానికి ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. దీనికి నందమూరి కుటుంబ సభ్యులు అంతా విచ్చేశారు. బాలకృష్ణ మోక్షజ్ఞతో కలిసి ఈ సినిమా చూడటానికి వచ్చారు.

సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ని అభినందించారు. మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఇవ్వాలి. అన్నయ్య హరికృష్ణ దీవెనలు, బాబాయ్ గా నా దీవెనలు నీకు ఉంటాయి అని కళ్యాణ్ రామ్ ని ఉద్దేశించి అన్నారు.

Vijay Devarakonda : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయడానికి ఎదురు చూస్తున్నా.. చెన్నైలో లైగర్..

డైరెక్టర్ వశిష్ఠని ఉద్దేశించి.. సినిమా బాగా చేశావు, త్వరలో మనం సినిమా చేద్దాం. నీలాంటి యంగ్ స్టర్స్ రావాలి. మెల్లి మెల్లిగా కాకుండా మొదటిసారే ఇంత పెద్ద సినిమా బాగా చేశావు. ఇలాంటి అవకాశం ఇవ్వడం మా నందమూరి వంశానికే దక్కుతుంది. మేము కొత్త వాళ్ళని, ట్యాలెంటెడ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము. ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాలు ఆదరించి మరోసారి తెలుగువారి అభిరుచిని తెలియచేశారు. నాన్న గారు అప్పట్లోనే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు తీశారు. ఇందులో మంచి సందేశం కూడా ఉంది అని అభినందించారు. బాలకృష్ణ బింబిసార సినిమా చూసి అభినందించడం ఇప్పుడు వైరల్ గా మారింది.