Unstoppable 2 : బావతో బాలయ్య సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో!

బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీగా హిట్ అయింది. ఈ షో వల్ల బాలయ్య లోని సరికొత్త కోణాన్ని చూడడంతో అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. దీంతో ఈ షోకి కొనసాగింపుగా సీజన్-2ని కూడా ప్రకటించి, మొదటి ఎపిసోడ్ కే అదిరిపోయే అతిధులను తీసుకువచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు షో నిర్వాహకులు.

Unstoppable 2 : బావతో బాలయ్య సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో!

Balayya Selfie with Chandra Babu Naidu

Unstoppable 2 : బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీగా హిట్ అయింది. ఈ షో వల్ల బాలయ్య లోని సరికొత్త కోణాన్ని చూడడంతో అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. దీంతో ఈ షోకి కొనసాగింపుగా సీజన్-2ని కూడా ప్రకటించి, మొదటి ఎపిసోడ్ కే అదిరిపోయే అతిధులను తీసుకువచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు షో నిర్వాహకులు.

Chandrababu Naidu : నాది, ఎన్టీఆర్‌ది రామాంజనేయ యుద్ధం.. వివాదాస్పద ఎన్టీఆర్ ఇష్యూపై మాట్లాడిన చంద్రబాబు..

ఈ శుక్రవారం గ్రాండ్ గా లాంచ్ అయిన సీజన్-2లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అయన తనయుడు లోకేష్ గెస్ట్ లుగా వచ్చారు. చంద్రబాబుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పడంతో మొదలైన ఈ షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయ విషయాలు గురించి మాట్లాడారు.

చంద్రబాబుకి సంబంధించిన ఎన్నో తెలియని విషయాలను బాలయ్య ఈ ఎపిసోడ్ ద్వారా ప్రజలకు తెలిసేలా చేశాడు. ఈ షో అనంతరం బాలయ్య, తన బావ, అల్లుడలతో దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్ గా మారింది. నెటిజెన్ల ఈ ఫోటోను షేర్లు మీద షేర్లు చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.