Bigg Boss 7 Day 29 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నదెవరు? బిగ్‌బాస్ కూడా తొండాట ఆడుతున్నడని శివాజీ ఫైర్..

ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ చప్పగానే సాగింది. ఒక్క శివాజీతో గొడవలు తప్ప మిగిలిన వాళ్లంతా మామూలుగానే నామినేట్ చేశారు. ఈ ఎపిసోడ్ అంతా శివాజీ పైనే నడిచింది. అందరితో శివాజీ గొడవ పెట్టుకున్నాడు. ఆఖరికి బిగ్‌బాస్ మీద కూడా అరిచేశాడు.

Bigg Boss 7 Day 29 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నదెవరు? బిగ్‌బాస్ కూడా తొండాట ఆడుతున్నడని శివాజీ ఫైర్..

Bigg Boss 7 Day 29 Highlights Nominations Day Contestants list in Nominations

Bigg Boss 7 Day 29 :  ఆదివారం వీకెండ్ ఎంటర్టైన్మెంట్, ఎలిమినేషన్ అయిపోవడంతో సోమవారం నామినేషన్స్ తో మొదలైంది. అయితే ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ చప్పగానే సాగింది. ఒక్క శివాజీతో గొడవలు తప్ప మిగిలిన వాళ్లంతా మామూలుగానే నామినేట్ చేశారు. ఈ ఎపిసోడ్ అంతా శివాజీ పైనే నడిచింది. అందరితో శివాజీ గొడవ పెట్టుకున్నాడు. ఆఖరికి బిగ్‌బాస్ మీద కూడా అరిచేశాడు.

నామినేషన్స్ లో మొదట శివాజీ వచ్చి అమర్ దీప్, ప్రియాంకలని నామినేట్ చేశాడు. ఈ నేపథ్యంలో శివాజీ – అమర్ దీప్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ప్రియంక.. శివాజీ, యావర్ లని నామినేట్ చేసింది. గౌతమ్.. అమర్ దీప్, శివాజీలని నామినేట్ చేశాడు. శుభశ్రీ.. అమర్ దీప్, ప్రియాంక లని నామినేట్ చేసింది. యావర్.. అమర్ దీప్, ప్రియాంకలని నామినేట్ చేశాడు. అమర్ దీప్.. శుభశ్రీ, శివాజీలని నామినేట్ చేశాడు. తేజ.. గౌతమ్, యావర్ లని నామినేట్ చేసాడు. ఇక తేజని నాగార్జున డైరెక్ట్ గా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. పవరాస్త్ర ఉండటంతో శోభాశెట్టి, సందీప్, ప్రశాంత్ లని నామినేట్ చేయడానికి వీల్లేదు.

Also Read : Bigg Boss 7 : ఐదో వారంలో నామినేష‌న్స్‌లో ఉన్న‌దెవ‌రో..? రాజుగారి పెద్ద భార్య మంచిదంటే..?

దీంతో ఈ వారం నామినేషన్స్ లో.. తేజ, శివాజీ, ప్రియాంక, అమరదీప్, శుభశ్రీ, యవర్, గౌతమ్ ఉన్నారు. ఇక శివాజీ తనని నామినేట్ చేసిన వారందరితో గొడవలు పెట్టుకున్నాడు. తనది తప్పులేదని, తప్పు ఉంటే ఇపుడే ఎలిమినేట్ చేసేయండని కెమెరాలవైపు చూస్తూ చెప్పాడు. నామినేషన్స్ అయ్యాక శివాజీ మళ్ళీ.. నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని కాసేపు ఏడ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కూడా తొండి ఆట ఆడుతున్నాడు. నన్ను హౌస్ మెట్ గా తీసేసాడు. వాళ్ళు వాళ్ళు అనుకోని నన్ను బయటకి పంపించేశారు. బిగ్ బాస్ కి ఇవన్నీ తెలియవా? ఇంకా నేనెందుకు ఆడాలి? ఎవరిని ఎంటర్టైన్ చేయాలి అని ఫైర్ అయ్యాడు. అలాగే నేను బిగ్ బాస్ ఇచ్చే కప్పు కోసం కాదు ప్రేక్షకుల మనసులని గెలుచుకోవడానికి వచ్చాను అని చెప్పాడు శివాజీ. మరి ఈ వారం నామినేషన్స్ నుంచి ఎవరు అవుట్ అవుతారో చూడాలి.