Bigg Boss 7 : బిగ్బాస్ హౌస్లో వీకెండ్ స్పెషల్.. సిద్దార్థ్ క్లాస్, రవితేజ మాస్ ఎంట్రీ..
తాజాగా నేడు రాబోయే బిగ్బాస్ 35వ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా ఇందులో ఎలిమినేషన్ ఉత్కంఠతో పాటు ఎంటర్టైన్మెంట్ హంగామా కూడా ఉంది.
Bigg Boss 7 Day 35 Promo : బిగ్బాస్ నేటితో ఐదో వారం పూర్తవ్వబోతుంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా ఈ వారం ఇంకో కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవుతారు. ఈ వారం శుభశ్రీ కానీ, అమర్ దీప్ కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇక నేడు ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండబోతుంది.
తాజాగా నేడు రాబోయే బిగ్బాస్ 35వ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా ఇందులో ఎలిమినేషన్ ఉత్కంఠతో పాటు ఎంటర్టైన్మెంట్ హంగామా కూడా ఉంది. ప్రతి ఆదివారం ఎవరో ఒకరిని స్పెషల్ గెస్ట్ గా కూడా తీసుకొస్తారు. లేదా ఏదైనా సినిమా ప్రమోషన్స్ ఉంటే ఆ సినిమా యునిట్ వాళ్ళని తీసుకొస్తారు. ఈ వారం చిన్నా ప్రమోషన్స్ లో భాగంగా సిద్దార్థ్ బిగ్బాస్ లోకి క్లాస్ గా ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ తో హౌస్ లో సరదాగా గడిపినట్టు చూపించారు.
Also Read : Rashmika : ఆ ప్లేస్ తన డెస్టినేషన్ అంటున్న రష్మిక.. ఆ డెస్టినేషన్లో విజయ్ దేవరకొండ ఫోటో వైరల్..
అలాగే మాస్ మహారాజ రవితేజ దసరాకి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ బిగ్బాస్ లోకి మాస్ గా డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. మరి సిద్దార్థ్, రవితేజ బిగ్బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. నాగార్జున ఇకనుంచి బిగ్బాస్ 2.0 అని చెప్తూ ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే ఈ వారం మరి కొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారు.