Bigg Boss 7 : త‌ప్పుచేసిన టేస్టీ తేజ‌.. వీడియో చూపించి మ‌రీ.. మండిప‌డ్డ నాగార్జున‌

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజ‌న్ 7లో నాలుగో వారం పూర్తి కావొచ్చింది. శ‌నివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేశారు. బెల్ట్ ప‌ట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున‌.

Bigg Boss 7 : త‌ప్పుచేసిన టేస్టీ తేజ‌.. వీడియో చూపించి మ‌రీ.. మండిప‌డ్డ నాగార్జున‌

Bigg Boss Telugu 7 Day 27 Promo

Bigg Boss Telugu 7 : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజ‌న్ 7లో నాలుగో వారం పూర్తి కావొచ్చింది. శ‌నివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేశారు. బెల్ట్ ప‌ట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున‌. అలా కింగ్ బెల్ట్ ప‌ట్టుకోని రావ‌డం చూసిన కంటెస్టెంట్లు షాకైయ్యారు. సంచాల‌క్ సందీప్‌.. నీకు క‌ళ్లు క‌నిపించ‌డం లేవా..? అంటూ ప్ర‌శ్నించాడు. కెమెరాల్లోంచి నీకు కూడా క‌నిపించ‌లేదా అంటూ శివాజీని కాస్త గ‌ట్టిగానే అడిగాడు.

తేజా.. గౌతమ్ మెడకి బెల్ట్ వేసి లాగుతుంటే మాట్లాడలేదు.. అదే గౌతమ్.. తేజా మెడకి బెల్డ్ వేసి లాగుతుంటే మాత్రం వద్దని చెప్పావ్ అంటూ శివాజీని ప్ర‌శ్నించి వీడియో వేసి మ‌రీ చూపించాడు నాగార్జున‌. ఆ త‌రువాత తేజ చేసిన ఘ‌న కార్యాన్ని చూపించారు. ఇక్క‌డ ఎందుకు మాట్లాడ‌లేదు అంటూ శివాజీ ని ఏకీ పారేశాడు. సందీప్ సారీ చెప్ప‌గా సంచాల‌క్ గా మీరు ఫెయిల్ అయ్యారని మండిప‌డ్డాడు.

అటు త‌ప్పు చేసిన తేజ‌పై కింగ్ కోప‌డ్డాడు. ఓ ప‌క్క‌న అమ్మాయి అరుస్తుంటే నీకు విన‌బ‌డ‌టం లేదా..? అని నాగార్జున ప్ర‌శ్నించాగా అది ఎంక‌రేజ్‌మెంట్ అనుకున్నాన‌ని తేజ అన్నాడు. ఆ త‌రువాత నా వ‌ల్ల త‌ప్పు జ‌రిగింది. మీరు ఏ శిక్ష వేసినా ఒకే అని తేజ అన్నాడు. దీంతో తేజ చేసిన త‌ప్పుకు ఏ శిక్ష వేస్తే బాగుంటుందో కంటెస్టెంట్ల‌నే అడిగాడు కింగ్‌. జైలుకి పంపుదాం అని శుభ శ్రీ చెప్ప‌గా, చేసిన త‌ప్పుకి అది త‌క్కువ శిక్ష‌నే అవుతుంద‌ని ప్రియాంక అభిప్రాయ‌ప‌డింది. సందీప్ నువ్వు చెప్పు ఏం శిక్ష వేద్దాం అని అడ‌గ‌డంతో నేరుగా ఇంటికి పంపించేద్దాం సార్ అంటూ సందీప్ చెప్పాడు. తేజ‌తో పాటు మిగిలిన కంటెస్టెంట్లు షాక్ అయ్యారు.

Amrutha Chowdary : స్కంద సినిమాలో రామ్‌కి చెల్లెలిగా నటించింది ఎవరో తెలుసా? భీమవరం అమ్మాయి.. సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్..