BiggBoss 6 Day 12 : రెండో వారం కెప్టెన్ ఎవరూ ఊహించని విధంగా.. హౌస్ లో సందడి చేసిన కృతిశెట్టి, సుధీర్ బాబు..

కెప్టెన్ ఎన్నిక ఉండటంతో ముందుగా కెప్టెన్ ని ఎన్నుకున్నారు కంటెస్టెంట్స్. కెప్టెన్సీ కంటెండర్స్ గా చివరి వరకు చంటి, ఆర్జే సూర్య, రాజశేఖర్, ఇనయలు నిలిచారు. దీంతో వారికి..........

BiggBoss 6 Day 12 : రెండో వారం కెప్టెన్ ఎవరూ ఊహించని విధంగా.. హౌస్ లో సందడి చేసిన కృతిశెట్టి, సుధీర్ బాబు..

BiggBoss 6 Day 12 captain selection and enjoying contestants

BiggBoss 6 Day 12 :  బిగ్‌‌బాస్‌ ఆరో సీజన్‌ 12వ రోజు సరదాగా సాగిపోయింది. కెప్టెన్ ఎన్నిక ఉండటంతో ముందుగా కెప్టెన్ ని ఎన్నుకున్నారు కంటెస్టెంట్స్. కెప్టెన్సీ కంటెండర్స్ గా చివరి వరకు చంటి, ఆర్జే సూర్య, రాజశేఖర్, ఇనయలు నిలిచారు. దీంతో వారికి డీజేలుగా వ్యవహరించాలని ఓ టాస్క్ ఇచ్చారు. వాళ్ళు పాటలు ప్లే చేస్తుంటే కంటెస్టెంట్స్ డ్యాన్స్ చేయాలి. వారిలో ఎవరు బాగా ప్లే చేస్తే వారికి ఇద్దరిద్దరు కలిపి ఓట్లు వేయాలని చెప్పాడు బిగ్‌‌బాస్‌. ఈ టాస్క్ లో రాజశేఖర్‌కి నాలుగు ఓట్లు వచ్చాయి. మూడు ఓట్లు ఆర్జే సూర్యకి, రెండు చంటికి, ఒకటి ఇనయకి రావడంతో రాజశేఖర్ ఎవరూ ఊహించని విధంగా కెప్టెన్ అయ్యాడు. దీంతో ఈ వారం కెప్టెన్ గా రాజశేఖర్ ఉండనున్నారు.

ఇక కెప్టెన్సీ టాస్క్ తర్వాత బిగ్‌‌బాస్‌ హౌస్ లోకి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్‌బాబు, కృతిశెట్టి వచ్చి కంటెస్టెంట్స్ తో కలిసి సందడి చేశారు. హౌస్ లోని కంటెస్టెంట్స్ కి పలు సినిమాల్లోని సీన్లు ఇచ్చి యాక్ట్ చేసి చూపించమన్నారు. ఈ టాస్క్ లో భాగంగా రేవంత్‌ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుందో అంటూ పోకిరి సీన్లు చేశాడు, గీతూ రాయల్‌ బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్‌లా చేసింది. శ్రీహాన్‌, ఫైమా కలిసి `పోకిరి`లోని లిఫ్ట్ ఎపిసోడ్‌ చేసి నవ్వించారు. రాజశేఖర్‌, శ్రీ సత్య కలిసి `ప్రేమ కథా చిత్రమ్‌` సీన్లు చేశారు. శానీ, చంటి, ఆర్‌ జే సూర్య, అభినయశ్రీ కలిసి వెంకీ సినిమాలోని సీన్లు చేసి నవ్వించారు.

Amala Akkineni : నాగార్జునతో మళ్ళీ సినిమా చేయను.. నాపై ఆ బాధ్యతలు ఉన్నాయి అందుకే సినిమాలు చేయట్లేదు..

సుధీర్‌బాబు, కృతిశెట్టి కూడా ఈ టాస్క్ ని బిగా ఎంజాయ్ చేశారు. అయితే ఇందులో ఉత్తమ నటీనటులను ఎంపిక చేయమని బిగ్‌‌బాస్‌ చెప్పడంతో ఉత్తమ నటుడిగా శ్రీహాన్‌ని, ఉత్తమ నటిగా శ్రీసత్యని ఎంపిక చేశారు. అలా ఎపిసోడ్ ఆద్యంతం సరదాగా సాగిపోయింది. ఇక చివర్లో మళ్ళీ ఎప్పట్లానే గొడవలు అయ్యాయి. రేవంత్ చంటి, ఫైమాతో గొడవ పెట్టుకున్నాడు.