BiggBoss 6 Day 16 : బిగ్‌‌బాస్‌ “దొంగ పోలీస్” ఆట.. హౌస్ లో హీట్ పుట్టిస్తున్న నేటి ప్రోమో!

బిగ్‌‌బాస్‌ సీజన్-6 అప్పుడే మూడోవారంలోకి అడుగుపెట్టేసింది. హౌస్ నుంచి షాని, అభినయశ్రీ ఎలిమినేట్ చేస్తూనే కంటెస్టెంట్స్ అందరికి.. సరిగ్గా ఆడట్లేదు అని గట్టిగా క్లాస్ పీకాడు నాగార్జున. దీంతో మూడోవారం నామినేషన్స్ ని గొడవలతో రచ్చ రచ్చ చేశారు. ఈ వారం నామినేషన్స్ లో అత్యధిక ఓట్లు పడడంతో రేవంత్‌, బాలాదిత్య, గీతూ, ఆరోహి, చంటి, వాసంతి, నేహా, శ్రీహాన్‌ మూడో వారం ఎలిమినేషన్‌ లో ఉన్నారు. ఇక బిగ్‌‌బాస్‌ నిర్వాహకులు నేటి ప్రోమోని...

BiggBoss 6 Day 16 : బిగ్‌‌బాస్‌ “దొంగ పోలీస్” ఆట.. హౌస్ లో హీట్ పుట్టిస్తున్న నేటి ప్రోమో!

BiggBoss 6 Day 16 Episode Promo

BiggBoss 6 Day 16 : బిగ్‌‌బాస్‌ సీజన్-6 అప్పుడే మూడోవారంలోకి అడుగుపెట్టేసింది. మొదటివారం ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్‌‌బాస్‌ రెండోవారం ఇద్దర్ని హౌస్ నుంచి బయటకి పంపిచేస్తూ షాక్ ఇచ్చాడు. హౌస్ నుంచి షాని, అభినయశ్రీ ఎలిమినేట్ చేస్తూనే కంటెస్టెంట్స్ అందరికి.. సరిగ్గా ఆడట్లేదు అని గట్టిగా క్లాస్ పీకాడు నాగార్జున. దీంతో మూడోవారం నామినేషన్స్ ని గొడవలతో రచ్చ రచ్చ చేశారు.

BiggBoss 6 Day 15 : మూడో వారం నామినేషన్స్.. అరుపులు, గొడవలు.. కొట్టుకోవడానికి కూడా రెడీ అనేలా ఉన్నారుగా..
ఈ వారం నామినేషన్స్ లో అత్యధిక ఓట్లు పడడంతో రేవంత్‌, బాలాదిత్య, గీతూ, ఆరోహి, చంటి, వాసంతి, నేహా, శ్రీహాన్‌ మూడో వారం ఎలిమినేషన్‌ లో ఉన్నారు. ఇక బిగ్‌‌బాస్‌ నిర్వాహకులు నేటి ప్రోమోని విడుదల చేశారు. “ఈ వారం కెప్టెన్సీ పోటీదారుడికి ఇస్తున్న టాస్క్ అడవిలో ఆట” అంటూ మొదలైన ప్రోమో మంచి హీట్ పుట్టించేలా నడించింది.

ఈ టాస్క్ లో కొందరు పోలిసులగా, మరికొందరు దొంగలుగా, గీతూ రాయల్ అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా వ్యవహరిస్తున్నారు. టాస్క్ లో భాగంగా దొంగ పోలీసులు మధ్య గొడవ కాస్త హౌస్ మేట్స్ మధ్య గొడవగా మారి ఇనాయ, రేవంత్ అండ్ శ్రీహాన్ మధ్య పెద్ద గొడవే జరిగినట్టు ప్రోమోలో తెలుస్తుంది. మరి మూడోవారం కెప్టెన్ గా ఎవరు నిలవబోతున్నారో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.