BiggBoss 6 Day 30 : బిగ్‌బాస్ బర్త్ డే అంట.. గీతూకి లంచం ఇచ్చి మరీ..

మామూలుగానే గీతూ చేసే హడావిడి చూడలేము, ఇక బిగ్‌బాస్ పిలిచి మరీ ఇలా సీక్రెట్ గా లంచం ఇచ్చి హౌస్ లో గాసిప్స్ చెప్పమనడంతో కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు రెచ్చిపోయి..........

BiggBoss 6 Day 30 : బిగ్‌బాస్ బర్త్ డే అంట.. గీతూకి లంచం ఇచ్చి మరీ..

BiggBoss 6 Day 30 BiggBoss Birthday Celebrations

BiggBoss 6 Day 30 :  బిగ్‌బాస్ సోమవారం ఎపిసోడ్ అంతా నామినేషన్స్ ప్రక్రియతో వేడి వేడిగా సాగగా మంగళవారం సరదాగా సాగింది. బిగ్‌బాస్ స్వయంగా హౌస్ లో తన బర్త్ డే అని చెప్పుకున్నాడు. ఇవాళ తన బర్త్ డే అని కంటెస్టెంట్స్ అంతా ఆయన్ని ఎంటర్టైన్ చేయాలని ఆదేశించాడు. దీంతో బిగ్‌బాస్ అడిగినట్లు కంటెస్టెంట్స్ అంతా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు.

ఇందులో భాగంగా ఆర్జే సూర్య మిమిక్రీ చేశాడు, ఫైమా కామెడీ స్కిట్ చేసింది. శ్రీహాన్-శ్రీసత్య ఒక సాంగ్ కి ఫుల్ కెమిస్ట్రీతో డ్యాన్స్ వేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ చేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్ గీతూని సీక్రెట్ రూమ్ లోకి పిలిచాడు. గీతూకి వేడి వేడి చికెన్, కోక్ ఆఫర్ చేశాడు, కానీ అవి తినాలంటే హౌస్ లో ఉన్న ఏవైనా గాసిప్స్ చెప్పాలని కండిషన్ పెట్టాడు. ఇలా లంచం ఇచ్చి గీతూతో గాసిప్స్ చెప్పించుకున్నాడు బిగ్‌బాస్.

మామూలుగానే గీతూ చేసే హడావిడి చూడలేము, ఇక బిగ్‌బాస్ పిలిచి మరీ ఇలా సీక్రెట్ గా లంచం ఇచ్చి హౌస్ లో గాసిప్స్ చెప్పమనడంతో కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు రెచ్చిపోయి ఉన్నవి, లేనివి, తన నోటికి వచ్చినవి చెప్పేసింది. ఇనయ-ఆర్జే సూర్య మధ్య ఏదో ఉందని, ఇనయా ఎంత ట్రై చేసినా సూర్య పట్టించుకోవట్లేదని, శ్రీసత్యను అర్జున్ బాగా ట్రై చేస్తున్నాడని, బాలాదిత్య దీపు దీపు అని కలవరిస్తాడని చెప్పింది.

Dhanush-Aishwarya : ధనుష్-ఐశ్వర్య మళ్ళీ కలుస్తున్నారా?? అందుకోసమేనా??

అరగంటకు పైగా సీక్రెట్ రూమ్ లో ఉంది వచ్చిన గీతూతో బిగ్‌బాస్ ఏం చెప్పాడు అని అంతా అడిగారు, కానీ గీతూ గురించి తెలిసిందే కదా. ఏదేదో కథలు అల్లేసి నా గురించి మీరేమనుకుంటున్నారో బిగ్‌బాస్ నాకు చెప్పేసాడు అంటూ హడావిడి చేసింది. బిగ్‌బాస్ ఇచ్చిన చికెన్ ఎవరికీ పెట్టకుండా అందర్నీ ఊరించి మరీ తింది.

ఆ తర్వాత ఫైమాని సీక్రెట్ రూమ్ లోకి పిలిచాడు బిగ్‌బాస్. ఒక పిజ్జా ఆఫర్ చేసి అది తినాలంటే ఒక టాస్క్ చేయాలని చెప్పాడు. హౌస్ లో రాత్రి పూట అందరి నిద్రని మూడు సార్లు చెడగొట్టాలి, కానీ అది నువ్వని తెలీకూడదు అని అని చెప్పాడు. మరి ఫైమా బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తిచేస్తుందో లేదో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాలి.