BiggBoss 6 Day 41 : హౌస్ లో గుడ్ ఎవరు బ్యాడ్ ఎవరు?? ఎలిమినేషన్స్ నుంచి నాగార్జున ఎవర్ని సేవ్ చేశారు??

ఈ వారం టాస్కులని ఎవరు ఎలా ఆడారో చెప్పాడు నాగార్జున. దీనికి సంబంధించి నాగార్జున కంటెస్టెంట్స్ కి గుడ్, యావరేజ్, డెడ్ అని ట్యాగ్స్ ఇచ్చాడు. ఇందులో భాగంగా...............

BiggBoss 6 Day 41 :  హౌస్ లో గుడ్ ఎవరు బ్యాడ్ ఎవరు?? ఎలిమినేషన్స్ నుంచి నాగార్జున ఎవర్ని సేవ్ చేశారు??

BiggBoss 6 Day 41 good and average tags to contestants

BiggBoss 6 Day 41 :  వీకెండ్ ఎపిసోడ్ లో కాసేపు సరదాగా, కాసేపు సీరియస్ గా సాగింది. నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. రోహిత్ తాను రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ అయి పెద్ద త్యాగమే చేశాడు. ఇదే విషయాన్నీ నాగార్జున ఓ వీడియో బైట్ లో చూపించారు. రోహిత్ కోసం ఎవరు త్యాగం చేస్తారు అని బిగ్‌బాస్ అడిగినప్పుడు అందరూ ఓకే అన్నారు. కానీ సాయం చేసే టైంకి అందరూ కలిసి వాసంతిని డిసైడ్ చేశారు. దీంతో బిగ్‌బాస్ వాసంతిని ఆమె జుట్టు కత్తిరించుకోమన్నాడు. వాసంతి దీనికి ఒప్పుకుంది. బిగ్‌బాస్ ఆదేశం ప్రకారం వాసంతి తన జుట్టును భుజాల వరకూ కట్ చేసుకొని, తన ఇష్టప్రకారమే ఈ పని చేస్తున్నాను అని చెప్పింది.

కాసేపు ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడించాడు నాగార్జున. ఆ తర్వాత కొంతమందిని ప్రత్యేక గదిలోకి పిలిపించి మాట్లాడాడు నాగార్జున. ఈ క్రమంలో బాలాదిత్యను పిలిచి గీతూ తనని ఎలా మోసం చేసిందో చూపెట్టడంతో బాలాదిత్య ఆశ్చర్యపోయాడు. అయినా తన మంచి కోసమే చెప్పింది అంటూ గీతూని సపోర్ట్ చేశాడు బాలాదిత్య. ఆ తర్వాత ఫైమాని పిలిస్తే ఇనయా-సూర్య మధ్య ఉన్న క్రష్ గురించి చెప్పింది.

Manchu Vishnu: గరికపాటి కామెంట్స్ పైన స్పందించిన మంచు విష్ణు..

ఇక ఈ వారం టాస్కులని ఎవరు ఎలా ఆడారో చెప్పాడు నాగార్జున. దీనికి సంబంధించి నాగార్జున కంటెస్టెంట్స్ కి గుడ్, యావరేజ్, డెడ్ అని ట్యాగ్స్ ఇచ్చాడు. ఇందులో భాగంగా సూర్య, ఫైమా, రేవంత్‌, శ్రీసత్య, శ్రీహాన్‌, రోహిత్‌ బాగా ఆడారని చెప్పి వాళ్లకి గుడ్ ట్యాగ్ ఇచ్చారు. బాలాదిత్య, రాజ్‌, అర్జున్, కీర్తి, వాసంతి, సుదీప, మెరీనా, ఆదిరెడ్డికి యావరేజ్‌ ట్యాగ్ ఇచ్చారు. ఇక మిగిలిన వాళ్లకి బ్యాడ్ ట్యాగ్ ఇచ్చారు. ఆటా తీరు మార్చుకోవాలని నాగ్ హెచ్చరించాడు.

ఇక ఈ వారం ఎలిమినేషన్ లో శ్రీసత్య, శ్రీహాన్, అర్జున్, గీతూ, వాసంతి, బాలాదిత్య, కీర్తి, సుదీప ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో మొదట శ్రీసత్యను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశారు నాగార్జున. మిగిలిన ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం చూద్దాం అని చెప్పాడు. మరి నేటి ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.