BiggBoss 6 Day 54 : ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసా ?? కెప్టెన్ గా పని మొదలుపెట్టిన శ్రీహాన్..

 బిగ్‌బాస్ లో ఈ వారం శ్రీహాన్ కెప్టెన్ గా గెలిచాడు. శుక్రవారం ఎపిసోడ్ లో శ్రీహన్ ని అందరూ కలిసి కెప్టెన్ కుర్చీ మీద కుర్చోపెట్టాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో శ్రీహాన్ కి వెన్నుపోటు పొడిచిన ఇనయా మళ్ళీ సూర్యకి దగ్గరైంది....................

BiggBoss 6 Day 54 : ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసా ?? కెప్టెన్ గా పని మొదలుపెట్టిన శ్రీహాన్..

BiggBoss 6 Day 54 worst performer of the week

BiggBoss 6 Day 54 :  బిగ్‌బాస్ లో ఈ వారం శ్రీహాన్ కెప్టెన్ గా గెలిచాడు. శుక్రవారం ఎపిసోడ్ లో శ్రీహన్ ని అందరూ కలిసి కెప్టెన్ కుర్చీ మీద కుర్చోపెట్టాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో శ్రీహాన్ కి వెన్నుపోటు పొడిచిన ఇనయా మళ్ళీ సూర్యకి దగ్గరైంది. సూర్యని హగ్ చేసుకొని మాట్లాడింది. కాసేపు వీళ్లిద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.

కిచెన్ లో గీతూ, బాలాదిత్య గొడవ పడ్డారు. గీతూకి మంచి చెప్పినా వినకుండా తాను చేసిందే రైట్ అని పదే పదే వేరేవాళ్లతో గొడవపెడుతుంది. హౌజ్ లో యమహా కాల్‌ ఆఫ్‌ ద బ్లూ టాస్క్‌లో రోహిత్‌ గెలిచి ఓ జాకెట్‌ ని గెలుచుకున్నాడు. అయితే చివరిదాకా ఆడి తాను గెలిచాను అనుకున్న రేవంత్ ని విన్నర్‌గా ప్రకటించకపోవడంతో రేవంత్ అలిగి వెళ్ళిపోయాడు.

అనంతరం హౌజ్ లో వరస్ట్‌ పర్ఫామర్‌ను ఎంచుకోమని కెప్టెన్‌ శ్రీహాన్‌ కి చెప్పాడు బిగ్‌బాస్‌. కెప్టెన్‌ శ్రీహాన్ తనకిచ్చిన ఎరుపు రంగుని బాలాదిత్య ముఖానికి పూసి తనను వరస్ట్ పర్ఫార్మర్ అనడంతో బాలాదిత్య జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి గీతూకి సలహాలు ఇవ్వబోతే నేనింతే అని మళ్ళీ ఆదిరెడ్డితో గొడవ వేసుకుంది. ఇక ఆదిరెడ్డి కూతురు హద్విత ఫస్ట్‌ బర్త్‌డే కావడంతో బిగ్‌బాస్‌ వాళ్ళ ఫ్యామిలీ కూతురి బర్త్ డేని సెలెబ్రేట్ చేసిన వీడియో చూపించగా ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు.

BiggBoss 6 Day 53 : ఈ వారం కెప్టెన్ ఎవరో తెలుసా??

ఇక కెప్టెన్‌ గా శ్రీహాన్‌ ఇంటిసభ్యులకు పనులు అప్పగించేందుకు అందరితో సమావేశం నిర్వహించాడు. దీంట్లో ఇనయా, శ్రీహాన్ కి మళ్ళీ గొడవ అయింది. ఇనయాని వంట చేయమంటే చేయను అని చెప్పేసింది. రైస్ వేస్ట్ చేస్తున్నారంటూ కంటెస్టెంట్స్ పై మండిపడ్డాడు సూర్య. రైస్ వేస్ట్ చేస్తే మాత్రం ఊరుకోను అన్నాడు. ఈ విషయంలో కూడా శ్రీహాన్, ఇనయాల మధ్య మళ్ళీ గొడవలయ్యాయి. నేడు వీకెండ్ ఎపిసోడ్ లో ఏ రేంజ్ లో నాగార్జున ఎంటర్టైన్మెంట్ చూపిస్తాడో చూడాలి.