BiggBoss 6 Day 63 : మొత్తానికి గీతూ ఎలిమినేట్ అయిందిగా.. ఇనయాకి కౌంటర్ ఇచ్చిన నాగ్..

ఇక చివర్లో నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కర్ని సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో శ్రీ సత్య, గీతూ మిగిలారు. చివరికి గీతూ ఎలిమినేట్ అని చెప్పాడు నాగార్జున. ఇక గీతూ నేను వెళ్ళాను అంటూ ఏడుపు అందుకుంది...............

BiggBoss 6 Day 63 : మొత్తానికి గీతూ ఎలిమినేట్ అయిందిగా.. ఇనయాకి కౌంటర్ ఇచ్చిన నాగ్..

BiggBoss 6 Day 63 Geethu eliminated from biggboss

BiggBoss 6 Day 63 :  బిగ్‌బాస్ ఆదివారం ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుందని తెలిసిందే. ఎప్పటిలాగే డ్యాన్స్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. మొదట కంటెస్టెంట్స్ తో కుర్చీలాటని కొత్తగా ఫ్లవర్ గేమ్ అని ఆడించాడు. పాట ప్లే అయినంతసేపు డ్యాన్స్ వేసి పాట ఆగిపోగానే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లవర్స్ లో ఒకదాన్ని పట్టుకోవాలి. చాలా సరదాగా సాగింది ఈ గేమ్.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో మిమ్మల్ని గేమ్ లో పాములా కాటేసేది ఎవరు? నిచ్చెనలా సాయపడేది ఎవరని అడిగాడు. ఇందుకు సింబాలిక్ గా ఒక పాము, ఒక నిచ్చెనని ఏర్పాటు చేసాడు బిగ్‌బాస్. కంటెస్టెంట్స్ ఎవరి పేరు దేనికి చెప్తే వాళ్ళు దాని దగ్గరికి వెళ్లి నిల్చోవాలి. బాలాదిత్య.. గీతూ పాము, ఆదిరెడ్డి నిచ్చెన అని చెప్పాడు. ఆదిరెడ్డి.. శ్రీహాన్‌ పాము, గీతూ నిచ్చెన అని చెప్పాడు. గీతూ.. బాలాదిత్య పాము, ఆదిరెడ్డి నిచ్చెన అని చెప్పింది. ఫైమా.. ఇనయా పాము, గీతూ నిచ్చెన అని చెప్పింది. ఇనయా.. ఆదిరెడ్డి పాము, గీతూ నిచ్చెన అని చెప్పింది. రాజ్‌.. ఆదిరెడ్డి పాము, ఫైమా నిచ్చెన అని చెప్పాడు. రోహిత్‌.. గీతూ పాము, మెరీనా నిచ్చెన అని చెప్పాడు. శ్రీహాన్‌.. ఇనయా పాము, రేవంత్‌ నిచ్చెన అని చెప్పాడు. రేవంత్‌.. వాసంతి పాము, శ్రీహాన్‌ నిచ్చెన అని చెప్పాడు. వాసంతి.. శ్రీహాన్‌ పాము, ఆదిరెడ్డి నిచ్చెన అని చెప్పాడు. కీర్తి.. శ్రీహాన్‌ పాము, మెరీనా నిచ్చెన అని చెప్పింది. మెరీనా.. గీతూ పాము, ఆదిరెడ్డి నిచ్చెన అని చెప్పాడు. శ్రీసత్య.. ఫైమా పాము, గీతూ నిచ్చెన అని చెప్పింది. ఎందుకు అలా చెప్పారో ఒక్కొక్కరు ఒక్కో కారణం కూడా చెప్పారు. కొంతమంది చాలా సిల్లీ కారణాలు చెప్పడంతో వాళ్ళతో నాగార్జున ఓ ఆట ఆడుకున్నాడు.

ఇనయా సూర్య వెళ్ళిన దగ్గర్నుంచి మరీ ఓవర్ చేస్తూ సూర్యనే తలుచుకుంటుంది. దీంతో ఆదివారం ఎపిసోడ్ లో ఇనయాని సీక్రెట్ రూమ్ కి వెళ్లి చూడమన్నాడు నాగార్జున. సూర్య ఉంటాడేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ అక్కడ సూర్య ఫోటో ఉండటంతో ఆ ఫోటోకి ముద్దులు పెట్టింది. సూర్య వస్తాడనుకున్నావా, సూర్య బుజ్జమ్మతో బిజీగా ఉన్నాడు అని ఇనయా కి కౌంటర్ ఇచ్చి ఇకనైనా గేమ్ మీద ఫోకస్ చెయ్ అని చెప్పాడు.

ఇక చివర్లో నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కర్ని సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో శ్రీ సత్య, గీతూ మిగిలారు. చివరికి గీతూ ఎలిమినేట్ అని చెప్పాడు నాగార్జున. ఇక గీతూ నేను వెళ్ళాను అంటూ ఏడుపు అందుకుంది. బిగ్‌బాస్ గెలవడానికి వచ్చాను, ఆట బాగా ఆడాను అని ఏడుస్తూ కూర్చుంది. అయితే గీతూ ఎలిమినేట్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందరికి పోటీగా అసలు రూల్స్ కూడా పాటించకుండా, ఎవర్ని లెక్క చేయకుండా ఇష్టమొచ్చినట్టు గేమ్ ఆడేది గీతూ. దీనివల్ల కంటెస్టెంట్స్ తో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉండేవి గీతూ తో. గీతూ చేసే ఓవర్ యాక్షన్ కి, ఆమె చూపించే యాటిట్యూడ్ కి అందరూ ఈమె ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత బెటర్ అనుకున్నారు. ఇక గీతూ ఎలిమినేట్ అయిపోవడంతో ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్స్ కూడా హమ్మయ్య అనుకున్నారు.

BiggBoss 6 Day 62 : గీతూ, శ్రీహాన్, రేవంత్, ఇనయాలపై ఫైర్ అయిన నాగార్జున.. వీకెండ్ ఎపిసోడ్ సీరియస్ మోడ్..

స్టేజి మీదకి వచ్చిన గీతూ నాగార్జున ముందు ఏడ్చింది. నాగార్జున ఆమెను ఓదారుస్తూ బిగ్‌బాస్ షో బ్రేకర్స్‌ ఎవరు? షో మేకర్స్‌ ఎవరు? అని చెప్పమన్నాడు. ఆది రెడ్డి, రేవంత్‌, సత్య, ఫైమా, శ్రీహాన్‌లు బిగ్‌బాస్ షో మేకర్స్ అని, ఇనయ, మెరీనా, రోహిత్‌, రాజ్‌, కీర్తిలు షో బ్రేకర్స్ అని చెప్పింది. ఆ తర్వాత ఏడుస్తూ అందరికి గుడ్ బై చెప్తూ హౌజ్ నుంచి వెళ్ళిపోయింది.