BiggBoss 6 Day 66 : అందరూ రేవంత్‌ని టార్గెట్ చేశారుగా.. బిగ్‌బాస్ కి అనవసరంగా వచ్చాను.. ఏడ్చేసిన రేవంత్..

టాస్క్ తర్వాత రేవంత్ సీరియస్ అయ్యాడు. అందరూ నా వీక్ నెస్ మీద కొట్టారు. నేను ఫిజికల్ లా ఆడాలని చూశారు. ఇప్పటికే ఎల్లో కార్డు ఇచ్చారు. ఈ సారి రెడ్ కార్డు ఇప్పించడానికి అందరు కలిసి ప్లాన్ వేశారు. నా కష్టం అంతా..............

BiggBoss 6 Day 66 : అందరూ రేవంత్‌ని టార్గెట్ చేశారుగా.. బిగ్‌బాస్ కి అనవసరంగా వచ్చాను.. ఏడ్చేసిన రేవంత్..

BiggBoss 6 Day 66 contestants targets revanth

BiggBoss 6 Day 66 :  బిగ్‌బాస్‌ లో కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులని రెండు టీమ్స్ గా స్నేక్, నిచ్చెన టీమ్స్ గా విడగొట్టగా రెండు టీమ్స్ టాస్క్ లో పోటీ పడుతున్నాయి. గత ఎపిసోడ్ లో గేమ్ నుంచి సత్య, ఇనయా, వాసంతి, రోహిత్ అవుట్ అవ్వగా నిన్నటి ఎపిసోడ్ లో బిగ్‌బాస్‌ వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఇచ్చి మళ్ళీ గేమ్ లోకి పిలిపించాడు. ఆటలో ఓడిపోయినందుకు ఇనయా ఫ్రస్టేట్ అయి భూతులు తిట్టేసి మళ్ళీ సారీ అని చెప్పి ఏడుస్తూ కూర్చుంది.

నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి నాగమణి అనే టాస్క్ ఇచ్చారు. ఒక టీంకి కొన్ని మణులని ఇచ్చి వాటిని కాపాడుకోవాలని చెప్పాడు బిగ్‌బాస్‌. మరో టీం వాళ్ళ దగ్గర్నుంచి ఆ మణులని లాక్కోవాలని చెప్పాడు. ఇంకేముంది ఇది కూడా ఫిజికల్ టాస్క్ లా మారిపోయింది. ఎప్పటిలాగే రేవంత్ అందర్నీ తోసేయడం, కొట్టడం, లాగడం చేయడంతో అవతలి టీం వాళ్ళు కూడా రెచ్చిపోయారు. అవతలి టీంలోని వాళ్లంతా రేవంత్ ని టార్గెట్ చేసి మాట్లాడటం మొదలు పెట్టారు. ఒకర్నొకరు తోసేసుకొని, కాళ్ళు పట్టుకొని లాగేసుకొని నానా రచ్చ చేశారు కంటెస్టెంట్స్.

ఈ టాస్క్ తర్వాత రేవంత్ సీరియస్ అయ్యాడు. అందరూ నా వీక్ నెస్ మీద కొట్టారు. నేను ఫిజికల్ లా ఆడాలని చూశారు. ఇప్పటికే ఎల్లో కార్డు ఇచ్చారు. ఈ సారి రెడ్ కార్డు ఇప్పించడానికి అందరు కలిసి ప్లాన్ వేశారు. నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎవరికీ ఆడటం చేతకాక నా మీద కంప్లైంట్ చేస్తున్నారు. నేను అనవసరంగా బిగ్‌బాస్‌ కి వచ్చాను అంటూ ఎమోషనల్ అయి ఏడ్చాడు రేవంత్.

BiggBoss 6 Day 64 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా?? అందరూ కలిసి ఇనయాని టార్గెట్ చేశారుగా..

ఈ టాస్క్ అయ్యేసరికి సంచాలకులుగా వ్యవహరించిన వాసంతి, ఇనయా పాము టీమ్‌ గెలిచినట్లు తెలిపారు. ఇక చివరి కెప్టెన్సీ టాస్క్ కి ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్‌, కీర్తి, మెరీనాలు పోటీపడనున్నారు. వారితో పాటు శ్రీహాన్ కూడా అర్హత సాధించినా గత వారం నాగార్జున ఇచ్చిన పనిషమెంట్ కారణంగా శ్రీహాన్ కెప్టెన్సీ పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే శ్రీహాన్ బదులు ఎవర్నైనా పంపించొచ్చు అని బిగ్‌బాస్‌ చెప్పడంతో శ్రీసత్యని పంపించాడు శ్రీహాన్. మరి నేటి ఎపిసోడ్ లో ఏ టాస్క్ ఆడి బిగ్‌బాస్‌ హౌజ్ కి కొత్త కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి.