BiggBoss 6 Day 82 : బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా..?

 బిగ్‌బాస్‌ లో గత ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి ఎమోషనల్ ఎపిసోడ్ నడిపారు. శుక్రవారం ఎపిసోడ్ లో కూడా మిగిలిన ఒక్క రేవంత్ ఫ్యామిలీ కూడా వచ్చేశారు. మొదట రేవంత్ కి....................

BiggBoss 6 Day 82 : బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా..?

BiggBoss 6 Day 82 new captain in BiggBoss House

BiggBoss 6 Day 82 :  బిగ్‌బాస్‌ లో గత ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి ఎమోషనల్ ఎపిసోడ్ నడిపారు. శుక్రవారం ఎపిసోడ్ లో కూడా మిగిలిన ఒక్క రేవంత్ ఫ్యామిలీ కూడా వచ్చేశారు. మొదట రేవంత్ కి తన భార్యతో వీడియో కాల్ చేయించాడు. రేవంతా భార్య అన్వితతో మాట్లాడుతూ ఏడ్చేశాడు. తనకి డెలివరీ డేట్ ఇచ్చారని చెప్పింది అన్విత. ఇక వీడియో కాల్ కట్ అవ్వడంతో ఇంకొంచెం సేపు మాట్లాడతాను అంటూ ఏడ్చాడు రేవంత్.

ఇంతలోనే రేవంత్ తల్లి హౌజ్ లోకి వచ్చింది. తల్లిని చూసి ఎమోషనల్ అయిన రేవంత్ ఆమెని హగ్ చేసుకొని ఏడ్చేశాడు. రేవంత్ తల్లి మాట్లాడుతూ.. ఎందుకు ఊరికే ఏడుస్తున్నావు, కోపం ఎందుకు వస్తుంది, అందరికి తిండి పెట్టడానికి నీకేమైంది, తిండి దగ్గర రూల్స్ పెడతావేంటి అంటూ తిట్టింది. అలాగే గడ్డం ఎందుకు అంత పెంచుకున్నావు, తీసేయొచ్చు కదా అని చెప్పడంతో గడ్డం తీసేశాడు రేవంత్. రేవంత్ తో కలిసి స్టెప్పులేసి అనంతరం హౌజ్ నుంచి వెళ్ళిపోయింది.

BiggBoss 6 Day 81 : ఇనయా కోరిక నెరవేర్చిన బిగ్‌బాస్.. శ్రీహాన్ కి పెద్ద సర్ప్రైజ్..

ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో చివరి కెప్టెన్ గా ఈ సారి ఇనయా గెలిచి మొదటిసారి ఇనయా కెప్టెన్ అయింది. దీంతో ఇనయా చాలా సంతోషపడింది. నేను కెప్టెన్ గా అస్సలు రూల్స్ పెట్టను అని, ముఖ్యంగా తిండి దగ్గర అస్సలు రూల్స్ పెట్టను అని, హౌజ్ లో మీకిష్టమొచ్చినట్టు ఉండండి అంటూ అందరికి చెప్పి రేవంత్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది. మరి నేటి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి క్లాస్ పీకుతారో చూడాలి.