Anasuya Trolling : దిగజారుతున్న ట్రోలింగ్.. మీ అమ్మ, అక్కని ఇలాగే అడుగుతావా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ

కొంతమంది నెటిజన్లు ఆ ట్రోలింగ్ లో దిగజారి అసభ్యకర పదాలు వాడుతున్నారు. వీటికి కూడా అనసూయ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. తాజాగా ఓ నెటిజన్ నువ్ ఎంత తీసుకుంటావు అదే ఒక షోకి అని...................

Anasuya Trolling : దిగజారుతున్న ట్రోలింగ్.. మీ అమ్మ, అక్కని ఇలాగే అడుగుతావా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ

Degrading trolling on anchor Anasuya

 

Anasuya Trolling :  బుల్లితెరపై యాంకర్ గా వెలుగుతూనే సినిమాల్లో వరుస ఛాన్సులు కొట్టేస్తుంది అనసూయ. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది. సినిమాల్లో, షోలలో కూడా అందాల ఆరబోతకు ఏ మాత్రం తగ్గదు అనసూయ. అయితే అప్పుడప్పుడు అనసూయ చేసే ట్వీట్స్ వివాదాలకు దారి తీస్తుంటాయి. దీంతో నెటిజన్లు ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తుంటారు.

తాజాగా లైగర్ సినిమా ఆశించినంత విజయం దక్కకపోవడంతో విజయ్ పై ఇండైరెక్ట్ గా గతంలోని ఓ సంఘటని గుర్తుచేస్తూ అనసూయ ట్వీట్ చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అందులో కొంతమంది ఆంటీ అని పిలుస్తూ అనసూయని ట్రోల్ చేశారు. దీనికి అనసూయ సీరియస్ అయి ఆంటీ అని పిలిచిన వాళ్ళ అందరి ట్వీట్స్ స్క్రీన్ షాట్ తీసుకొని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తాను, జైలుకి పంపిస్తాను అని ట్వీట్ చేసింది. దీంతో ఆంటీ అంటే జైలుకి పంపిస్తావా అని నెటిజన్లు రెచ్చిపోయి అనసూయని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు కూడా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అన్ని సోషల్ మీడియాలో ఆంటీ అంటూ పోస్టులు, మీమ్స్, హ్యాష్ ట్యాగ్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఏకంగా ట్విట్టర్ లో ఇండియా వైడ్ ఆంటీ అనే పదం ట్రెండింగ్ అయిందంటే నెటిజన్లు అనసూయని ఏ రేంజ్ లో ఆడుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయినా అనసూయ వదలకుండా కొన్ని ట్వీట్స్ కి రిప్లై ఇస్తూ కౌంటర్లు వేస్తూనే ఉంది.

Anchor Anasuya : ట్రెండింగ్‌లో ‘ఆంటీ’.. పాపం అనసూయ.. దారుణంగా ఆడేసుకుంటున్న నెటిజన్లు..

అయితే అనసూయ ముందు మొదలుపెట్టడం, మరీ చిన్న చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అవ్వడంతో చాలా మంది అనసూయకి వ్యతిరేకంగానే ఉంటూ లాజిక్ గా ట్వీట్స్ చేస్తున్నారు. కానీ కొంతమంది నెటిజన్లు ఆ ట్రోలింగ్ లో దిగజారి అసభ్యకర పదాలు వాడుతున్నారు. వీటికి కూడా అనసూయ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. తాజాగా ఓ నెటిజన్ నువ్ ఎంత తీసుకుంటావు అదే ఒక షోకి అని ఇండైరెక్ట్ గా అసభ్యంగా ట్వీట్ చేశాడు. దీంతో అనసూయ దీనికి రిప్లై ఇస్తూ.. మీ అమ్మనో, అక్కనో, చెల్లినో, భార్యనో ఇలా అడుగుతావా? రోజుకి ఎంత తీసుకుంటావు అదే ఆఫీస్ లో పనికి జీతం అని ఇండైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కొంతమంది నెటిజన్లు ఇలా దిగజారి ట్రోల్ చేయడంతో అనసూయకి పాజిటివ్ గా మారిపోతున్నాయి పరిస్థితులు.

అయితే ఇలా ట్వీట్స్, ట్రోల్స్ చేసే వాళ్ళందర్నీ జైలులో వేయిస్తా, ఆ పని జరుగుతుంది, పోలీసులకి కంప్లైంట్ చేస్తా, సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాను అని పోస్ట్ చేయడంతో ఆంటీ అంటే కేసులు పెడతావా, మమ్మల్ని ఎంతమంది ఆంటీ, అంకుల్స్ అని పిలవట్లేదు, చిన్న పిల్లలు చాలా మంది అలాగే పిలుస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతావా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతూనే ఉన్నారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. ముందు అనసూయ మొదలుపెట్టింది కాబట్టి అనసూయ తగ్గేవరకూ నెటిజన్లు తగ్గేలా లేరు.