Rakul Preet Singh: షాకింగ్.. రకుల్ పెదవులకు సర్జరీ?

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించిన ఈ పంజాబీ అందాన్ని ఎప్పుడు అందహీనంగా ఉంది అని ఎవరు..

Rakul Preet Singh: షాకింగ్.. రకుల్ పెదవులకు సర్జరీ?

Rakul Preet Singh

Updated On : September 26, 2021 / 9:24 PM IST

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించిన ఈ పంజాబీ అందాన్ని ఎప్పుడు అందహీనంగా ఉంది అని ఎవరు కామెంట్ చేయలేదు. కానీ, ఈ బ్యూటీ మాత్రం తాను పెద్దగా అందంగా లేనని ఫీలైందో ఏమో కానీ ఓ సర్జరీ చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె కొత్త ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా తెగ వైరల్ అవుతుంది.

Evaru Meelo Koteeswarulu: తారక్ షో.. దసరాకి మహేష్.. దీపావళికి ప్రభాస్!

ఈ ఫొటోలో ఆమె పెదవులు మునుపటి కన్నా వేరే విధంగా ఉన్నాయి. ఆకృతి మారింది. షేప్ తేడాగా ఉండడంతో ఆమె సర్జరీ చేయించుకుందని చర్చించుకుంటున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా కొత్తగా బార్బీ డాళ్ లుక్ లో క‌నిపిస్తుంది ర‌కుల్‌. ఈ స్టిల్ పై నెటిజ‌న్లు కూడా కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. లుక్ మార్చుకునేందుకు సినీన‌టులు కాస్మోటిక్ స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం కొత్తేమి కాదు. హీరోల నుండి హీరోయిన్ల వరకు.. తెలుగు నుండి హిందీ పరిశ్రమ వరకు ఈ జాబితాలో చాలామంది సెలబ్రిటీలున్నారు.

Ketika Sharma:’రొమాంటిక్’ ట్రీట్.. కేతిక అందాలు అదరహో!

సహజంగా హీరోయిన్లు పెదవులు ఫుల్లుగా ఉండేందుకు (పౌట్ కోసం) సర్జరీ చేయించుకుంటారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువ. ఇప్పుడు ఈ జాబితాలోకి రకుల్ చేరిందా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి కొండ‌పొలం చేస్తోంది. హిందీలో డాక్ట‌ర్ జీ, థ్యాంక్ గాడ్‌, మేడే చిత్రాల్లో న‌టిస్తోండగా.. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ తో క‌లిసి అక్టోబర్ 31st లేడీస్ నైట్ సినిమా చేస్తోంది.