Director Shankar : చరణ్ సినిమా ఆపలేదు.. చరణ్, కమల్ సినిమాలు ఒకేసారి షూట్ చేస్తాను

చరణ్ శంకర్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. దీంతో శంకర్ చరణ్ సినిమా ఆగిపోతుందని వార్తలు వచ్చాయి..............

Director Shankar : చరణ్ సినిమా ఆపలేదు.. చరణ్, కమల్ సినిమాలు ఒకేసారి షూట్ చేస్తాను

Director Shankar gives clarity on Charan and Kamal Haasan Movies

Director Shankar :  డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో RC15 సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే సమ్మర్ కి రిలీజ్ కూడా ప్రకటించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఆగిపోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. ఇందుకు కారణం కమల్‌ హాసన్ – శంకర్‌ల కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు 2 సినిమాని మళ్ళీ మొదలుపెట్టడమే. గతంలో భారతీయుడు 2 సినిమా కొంత భాగం షూటింగ్ జరిగి ఆగిపోయింది. ఇప్పుడు చరణ్ శంకర్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. దీంతో శంకర్ చరణ్ సినిమా ఆగిపోతుందని వార్తలు వచ్చాయి.

Anupama Parameswaran: కార్తికేయ-2 టీమ్‌కు షాక్.. అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా పాజిటివ్!

తాజాగా డైరెక్టర్ శంకర్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలపై అభిమానులకి ఉన్న అనుమానాల్ని క్లియర్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలపై శంకర్ ట్వీట్ చేస్తూ.. ”ప్రస్తుతం చేస్తున్న కమల్‌హాసన్‌తో ‘ఇండియన్‌ 2, రామ్‌ చరణ్‌తో RC15 సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుతాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్‌ చేశాం. RC15 తర్వాతి షెడ్యూల్‌ హైదరాబాద్, వైజాగ్‌లో జరగనుంది. సెప్టెంబర్‌ తొలి వారంలోనే షూటింగ్‌ మొదలుపెడతాం” అని తెలిపారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.