BiggBoss 6 Arjun Kalyan: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అర్జున్‌ కళ్యాణ్ గురించి మీకు తెలుసా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఏడవ కంటెస్టెంట్‌గా అర్జున్‌ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. అర్జున్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో న్యూయార్క్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా పూర్తీ చేశాడు. 2013లో....

BiggBoss 6 Arjun Kalyan: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అర్జున్‌ కళ్యాణ్ గురించి మీకు తెలుసా..

Do You Know About BigBoss Contestant Arjun Kalyan

BiggBoss 6 Arjun Kalyan: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.

BiggBoss 6 Sri Satya: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ శ్రీసత్య గురించి మీకు తెలుసా..

ఈ సీజన్‌లో ఏడవ కంటెస్టెంట్‌గా అర్జున్‌ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. అర్జున్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో న్యూయార్క్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా పూర్తీ చేశాడు. 2013లో ‘చిన్న సినిమా’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత లవర్ ఫరెవర్, సూడోసైడ్, ఉప్మా తినేసింది, అన్ స్పోకెన్, పరిచయం, మిస్సమ్మ వంటి వెబ్‌ సిరీస్‌లతో గుర్తింపు పొందిన అర్జున్‌ ప్లేబ్యాక్‌, పెళ్లి కూతురి పార్టీ వంటి సినిమాల్లో నటించాడు.

ఆంధ్రప్రదేశ్‌ కొవ్వూరుకి చెందిన అర్జున్ ఇప్పుడు బిగ్‌బాస్‌-6లోకి ఎంట్రీ ఇవ్వడంతో నాగార్జున అతని లవ్ స్టోరీల గురించి తెలుపమని అడగా..”జెంటిల్మెన్ ఎంత మందిని ప్రేమించాడో అన్నది అలా చెప్పాడంటూ మాటదాటేసాడు”. అయితే ట్రూత్ అండ్ డేర్ అంటూ..ఎవ్వరికీ తెలియని నిజం చెప్పమని అడగా, “తనకు జరిగిన బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చాడు”. అయితే ఈ షో అర్జున్‌ కళ్యాణ్ కు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.