BiggBoss 6 Neha Chowdary: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నేహా చౌదరి గురించి మీకు తెలుసా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 నాలుగవ కంటెస్టెంట్‌గా ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి ఎంట్రీ ఇచ్చింది. తిరుపతి అమ్మాయ్ అయిన నేహా ఇండియా నుంచి అథ్లెటిక్ గా రెప్రజెంట్ కావాలని, భారత్ దేశపు జెండాని తన భుజాలపై మోయాలనే ధ్యేయంతో...

BiggBoss 6 Neha Chowdary: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నేహా చౌదరి గురించి మీకు తెలుసా..

Do You Know About BigBoss Contestant Neha Chowdary

BiggBoss 6 Neha Chowdary: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.

BiggBoss 6: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సుదీప(పింకీ) గురించి మీకు తెలుసా..

ఈ సీజన్‌లో నాలుగవ కంటెస్టెంట్‌గా ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి ఎంట్రీ ఇచ్చింది. తిరుపతి అమ్మాయ్ అయిన నేహా ఇండియా నుంచి అథ్లెటిక్ గా రెప్రజెంట్ కావాలని, భారత్ దేశపు జెండాని తన భుజాలపై మోయాలనే ధ్యేయంతో రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో నేషనల్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ అందుకుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు షోలకు యాంకరింగ్‌ చేస్తూ వచ్చింది.

స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన ఈమె 2019 వివో ప్రో కబడ్డీకు యాంకర్ గా చేయగా ఆ తరువాత 2020-21 ఐపీఎల్ కు, 2020 ఇండియా/ఇంగ్లాండ్ ODI సిరీస్, అదే సంవత్సరం జరిగిన T20 ఉమెన్స్ వరల్డ్ కప్ కు కూడా యాంకర్ గా వ్యవహరించింది. ఇక ఇప్పుడు బిగ్‌బాస్‌ షో ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన నేహాను నాగార్జున “నువ్వు ఏదో కండీషన్ మీద బిగ్‌బాస్‌ కి వచ్చావంటా, ఏంటది” అని అడిగిన ప్రశ్నకు..”ఇంటిలో వాళ్ళు పెళ్ళి పెళ్ళి అంటుంటే బిగ్‌బాస్‌ షోకి వెళ్లొచ్చాక చేసుకుంటా అని చెప్పి వచ్చాను” అని బదులిచ్చింది.