Dulquer Salmaan : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి భీమవరంలో భారీ కటౌట్..

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. పలు మలయాళం డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన దుల్కర్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువయ్యారు. తాజాగా సీతారామంతో.........

Dulquer Salmaan : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి భీమవరంలో భారీ కటౌట్..

Dulquer Salmaan :  మన తెలుగు వాళ్ళకి సినిమాలంటే ఎంత ప్రేమో అందరికి తెలిసిందే. ఇటీవల పాన్ ఇండియా, ఓటీటీల ప్రభావంతో భాషలతో సంబంధం లేకుండా కంటెంట్స్ ని, హీరోలని, నటీనటుల్ని ప్రోత్సహిస్తున్నారు. తెలుగులో వేరే భాష సినిమాలకి కూడా బాగా కలెక్షన్లు వస్తాయి. అందుకే చాలా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. పలు మలయాళం డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన దుల్కర్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువయ్యారు. తాజాగా సీతారామంతో మరో డైరెక్ట్ తెలుగు సినిమాతో పలకరించనున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా, మృణాల్ హీరోయిన్ గా రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సీతారామం నేడు ఆగస్టు 5న సౌత్ భాషల్లో రిలీజ్ కానుంది.

Ram charan-Shankar Movie : కాజల్ రీఎంట్రీ.. భారతీయుడు 2 కోసం చరణ్ సినిమాని పక్కనపెట్టేస్తున్న శంకర్..?

ఇటీవల జరిగిన సీతారామం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ గెస్ట్ గా రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. సినిమా రిలీజ్ అంటే ఆంధ్ర థియేటర్ల వద్ద ఎంత హంగామా ఉంటుందో మనకి తెలిసిందే. సీతారామం సినిమా రిలీజ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ లోని భీమవరంలోని ఒక థియేటర్‌లో ఈ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కి 35 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేయడం విశేషం. తెలుగు ప్రేక్షకులు మరోసారి భాషతో సంబంధం లేకుండా తమ ప్రేమని ఇలా చూపించారు. ఈ కటౌట్ చూసి మలయాళం దుల్కర్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.