Kashmir Files : ముదురుతున్న కాశ్మీర్ ఫైల్స్ వివాదం.. నదవ్ లాపిద్ పై నమోదైన పోలీస్ కేసు..

53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకుల ముగింపు సమయంలో IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని లేపుతున్నాయి. తాజాగా నదవ్ లాపిద్ పై గోవాలో పోలీస్ కేసు నమోదు అయ్యింది.

Kashmir Files : గోవాలో 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేదికపై వివాదం రాచుకుంది. వేడుకుల ముగింపు సమయంలో IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిద్.. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని లేపుతున్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి దేశవ్యాప్తంగా పలు సినిమాలను ఎంపిక చేయగా, అందులో ఒకటి కాశ్మీర్ ఫైల్స్ సినిమా.

The Kashmir Files : నిజాన్ని ఒప్పుకోలేకపోతే నోరు మూసుకుని కూర్చోండి.. అనుపమ్!

అయితే ఈ సినిమాలో ఒకప్పుడు కాశ్మీర్ పండిట్లపై జరిగిన మారణ కాండని చూపించారు. కాగా “ఈ సినిమా ఓ కుట్రపూరితమైన మరియు అసభ్యకరమైన సినిమా. ఈ చిత్రంలో చూపించినవన్నీ అవాస్తవం. ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో తెరకెక్కిన సినిమాలా ఉంది” అంటూ లాపిద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దింతో నవాద్ పై దేశవ్యతంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

తాజాగా నదవ్ లాపిద్ పై గోవాలో పోలీస్ కేసు నమోదు అయ్యింది. లాపిద్ వ్యాఖ్యలు దేశంలో మతాలు మధ్య గొడవలు పెట్టేలా ఉన్నాయి అంటూ, అతనిపై.. 121, 153, 295, 298, 505 సెక్షన్లు కింద కేసు ఫైల్ చేశాడు గోవా అడ్వకేట్ వినీత్ జిందాల్. కాగా నదవ్ లాపిద్ చేసిన వ్యాఖ్యలను అతని సొంత దేశం ఇజ్రాయిల్ దౌత్యవేత్తలు కూడా ఖండిస్తూ భారత్ కు క్షమాపణలు తెలియజేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు