GodFather: చిరుతో సల్లూ భాయ్‌ స్టెప్‌లు.. గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

మలయాళ మూవీ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిరంజీవి తాజా చిత్రం "‘గాడ్‌ఫాదర్" ఈ దసరా కానుకగా రిలీజ్ చేస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు. ఇక విడుదల డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచుతూ.. మూవీలోని ఫస్ట్ సింగల్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

GodFather: చిరుతో సల్లూ భాయ్‌ స్టెప్‌లు.. గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

GodFather First Single Release Date Fix

GodFather: మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిరంజీవి తాజా చిత్రం “‘గాడ్‌ఫాదర్” ఈ దసరా కానుకగా రిలీజ్ చేస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Godfather: గాడ్‌ఫాదర్ కోసం వీరమల్లు.. అభిమానులు గెట్ రెడీ!

దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా అర్.బి. చౌదరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నయనతార, సత్యదేవ్ ముఖ్యతారాగణంగా కనిపించనున్నారు. ఇక విడుదల డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచుతూ.. మూవీలోని ఫస్ట్ సింగల్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ సినిమాలో ఒక పాటకి చిరుతో కలిసి సల్మాన్ ఖాన్ కాలు కదిపిన సాంగ్ ని, చిత్ర యూనిట్ సెప్టెంబర్ 15న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తున్నట్టు ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఏ రేంజ్ స్టెప్ లు వేస్తారో చూడాలి.