Godfather: రీ-షూట్ జరుపుకుంటున్న గాడ్ ఫాదర్.. ముంబైలో చిత్ర యూనిట్!

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". ఈ చిత్రం మలయాళ చిత్రం లూసిఫర్‌కి అధికారిక రీమేక్. ఇక ఈ చిత్రం నేడు సెన్సార్ పూర్తీ చేసుకుని U/A సర్టిఫికెట్ తెచ్చుకుని, దసరా కానుకగా అక్టోబర్ 5 న విడుదల అవ్వడానికి సిద్దమవుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే...

Godfather: రీ-షూట్ జరుపుకుంటున్న గాడ్ ఫాదర్.. ముంబైలో చిత్ర యూనిట్!

Godfather Movie Re Shooting in Mumbai

Godfather: మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా “గాడ్ ఫాదర్”. ఈ చిత్రం మలయాళ చిత్రం లూసిఫర్‌కి అధికారిక రీమేక్. ఇందులో నయనతార, సత్యదేవ్ ప్రధాన తారాగణంగా కనిపించనుండగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Godfather: ఆచార్య సెంటిమెంట్ ఫాలో అవుతున్న చిరంజీవి.. ఆకాశ వీధుల్లో గాడ్ ఫాదర్ ఇంటర్వ్యూ!

ఇక ఈ చిత్రం నేడు సెన్సార్ పూర్తీ చేసుకుని U/A సర్టిఫికెట్ తెచ్చుకుని, దసరా కానుకగా అక్టోబర్ 5 న విడుదల అవ్వడానికి సిద్దమవుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చిరంజీవి, సల్మాన్ ఖాన్, సత్య దేవ్ ల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మూవీ టీం ముంబైలో చిత్రీకరిస్తుందట.

మూవీకి సంబంధించిన మేజర్ టాకీ పార్ట్ షూటింగ్, ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు. అయితే సెన్సార్ కూడా పూర్తీ చేసుకున్నా సినిమా షూటింగ్ ఇంకా పూర్తీ కాకపోవడం ఏంటి.. కొన్ని సీన్లు అనుకున్నంత స్థాయిలో రాలేదని చిరంజీవి అభిప్రాయపడంతో, మల్లి రీ-షూట్ జరుపుకుంటుందని కొందరు వాపోతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉన్నదో తెలియదు. మరి ఎన్నో అంచనాలు ఉన్నా “గాడ్‌ఫాదర్‌” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి.