HanuMan Official Teaser : హనుమాన్ టీజర్ వచ్చేసింది.. టీజర్‌లో ఎండ్‌లో వచ్చే సీన్ అయితే గూస్‌బంప్స్..

టాలీవుడ్ యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ హీరో చిత్రం "హను-మాన్". మన హిందూ పురాణ కథలలో చాలా మంది సూపర్ హీరోలు ఉన్నారు. అందులో ఒక్కరు రామభక్తుడు అయిన హనుమంతుడు. ఈ సినిమాలో హనుమంతుని శక్తులను తీసుకోని తెలుగుతెరకు ఒక సూపర్ హీరోని అందించబోతున్నాడు ప్రశాంత్ వర్మ. తాజాగా ఈ సినిమా అఫీషియల్ టీజర్ ని నేడు విడుదల చేశారు మేకర్స్. ఇక టీజర్ లోని...

HanuMan Official Teaser : హనుమాన్ టీజర్ వచ్చేసింది.. టీజర్‌లో ఎండ్‌లో వచ్చే సీన్ అయితే గూస్‌బంప్స్..

HanuMan Official Teaser Released

HanuMan Official Teaser : టాలీవుడ్ యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ హీరో చిత్రం “హను-మాన్”. మన హిందూ పురాణ కథలలో చాలా మంది సూపర్ హీరోలు ఉన్నారు. అందులో ఒక్కరు రామభక్తుడు అయిన హనుమంతుడు. మొదటి సినిమా నుంచి వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ వస్తున్న ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాలో హనుమంతుని శక్తులను తీసుకోని తెలుగుతెరకు ఒక సూపర్ హీరోని అందించబోతున్నాడు.

Hanu-Man: ప్రశాంత్ వర్మ హనుమాన్ టీజర్ రిలీజ్‌కు డేట్ లాక్!

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ గ్లిమ్స్ అండ్ మోషన్ పోస్టర్స్ మూవీపై ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా ఈ సినిమా అఫీషియల్ టీజర్ ని నేడు విడుదల చేశారు మేకర్స్. ఇక టీజర్ లోని విజువల్స్ చూస్తుంటే అదరహో అనేలా ఉన్నాయి. తన ఆలోచనలో ఉన్న అంజనాద్రి ప్రపంచాన్ని దర్శకుడు తెరమీదకి అనుకున్న రీతిలో చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

టీజర్ లో ఒక్క గ్రాఫిక్స్ మాత్రమే కాదు.. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, గ్రాండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు షార్ప్ ఎడిటింగ్ టీజర్ ని ఒక రేంజ్ లో నిలబెట్టాయి. ఇక టీజర్‌లో ఎండ్‌లో.. హనుమంతుడు గుహలో రామజపం చేస్తున్న సీన్ అయితే గూస్‌బంప్స్ రప్పించింది. ఇక ఈ సినిమాలో విలన్ గా వినయ్ రాయ్ నటిస్తుండగా.. హీరోయిన్ గా అమృత అయ్యర్, మరో ముఖ్యపాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ హను-మాన్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.