Pawan Klayan : బాలీవుడ్ యాక్టర్స్ తో షూట్ మొదలు పెట్టిన ‘హరి హర వీరమల్లు’

పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మొదటి పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ కథతో 'హరి హర వీరమల్లు'ని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు

Pawan Klayan : బాలీవుడ్ యాక్టర్స్ తో షూట్ మొదలు పెట్టిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu

Pawan Klayan :  పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మొదటి పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ కథతో ‘హరి హర వీరమల్లు’ని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్‌కు ముందు షూటింగ్ ప్రారంభమైంది. లాక్ డౌన్ పడటంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ షూటింగ్ ని పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో పవన్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ‘హరి హర వీరమల్లు’ షూట్ ని క్రిష్ తిరిగి ప్రారంభించాడు. హైద‌రాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో ‘హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు’ కొత్త షెడ్యూల్ రీస్టార్ట్ అయింది.

Raviteja : రవితేజ పాన్ ఇండియా సినిమా

తాజా షెడ్యూల్‌లో హై రేంజ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ నుంచి కూడా యాక్టర్స్ ని తీసుకొచ్చారు. బాలీవుడ్ యాక్ట‌ర్లు అర్జున్ రాంపాల్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో పాల్గొననున్నార‌ని సమాచారం. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పవన్ కళ్యాణ్ త్వరలో ఈ షెడ్యూల్ షూట్ లో జాయిన్ అవ్వబోతున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్ కి ఈ సినిమాని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.