Karthi : ఆల్రెడీ బాహుబలి చూశాం.. ఇంకో బాహుబలి అవసర్లేదు..

ఈ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ.. ''ఈ సినిమా మణిరత్నం గారి నలభై ఏళ్ల కల. సినిమా చాలా గొప్ప మీడియం. ఇక్కడ క్యాస్ట్, రిలీజియన్ తో సంబంధం లేకుండా పనిచేస్తాం. అందరూ అడుగుతున్నారు ఇది ‘బాహుబలి’ సినిమాలా ఉంటుందా అని.....................

Karthi : ఆల్రెడీ బాహుబలి చూశాం.. ఇంకో బాహుబలి అవసర్లేదు..

Hero Karthi Speech at Ponnyin Selvan 1 Pre Release Event

Karthi :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ.. లాంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా మొదటి పార్ట్ ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీంతో స్టార్లంతా హైదరాబాద్ లో సందడి చేశారు. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

Dil Raju : ఇప్పుడు సినిమాకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు.. బాగుంటే ఇండియా మొత్తం ఆదరిస్తారు..

ఈ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ.. ”ఈ సినిమా మణిరత్నం గారి నలభై ఏళ్ల కల. సినిమా చాలా గొప్ప మీడియం. ఇక్కడ క్యాస్ట్, రిలీజియన్ తో సంబంధం లేకుండా పనిచేస్తాం. అందరూ అడుగుతున్నారు ఇది ‘బాహుబలి’ సినిమాలా ఉంటుందా అని. మనం ఆల్రెడీ ఒక ‘బాహుబలి’ సినిమా చూశాం. మనకి ఇంకో ‘బాహుబలి’ అవసరం లేదు. ఇండియాలో చాలా కథలు ఉన్నాయి, చాలా మంది హీరోలు ఉన్నారు. వాటిని మనం ప్రజలకు చెప్పాలి. రామాయణ, మహాభారతం లాగా ఇది కూడా ఒక గొప్ప కథ. ఇందులో రాజకీయం, లవ్, రొమాన్స్, అడ్వెంచర్ అన్ని ఉన్నాయి. ఇలాంటి ఒక గొప్ప సినిమాని మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని అన్నారు.