Cheruvaina Dooramaina: హీరోగానే చెయ్యాలని చిన్న క్యారెక్టర్లు వచ్చినా చేయలేదు

చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చేరువైన.. దూరమైన..'.

Cheruvaina Dooramaina: వినాయక ఎంటర్టైన్‌‍మెంట్స్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘చేరువైన.. దూరమైన..’. స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా తెరంగ్రేటం చేస్తుండగా.. తరుణి సింగ్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ పమ్మి సంగీతం అందించగా.. ఈ చిత్రం ఆగస్ట్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా హీరో సుజిత్ మాట్లాడుతూ.. ‘నేను రోహన్ తనేజా అనే ఓ ముంబాయి బేస్డ్ ఇన్ స్టిట్యూట్‌లో నటనపై శిక్షణ తీసుకున్నానను. మామయ్య శ్రీనివాసరెడ్డి కూడా సినిమాల్లో వుండటంతో బహుశా ఆ బ్లడ్ నాలో కూడా వుండటంతో నటనపై ఆసక్తి ఏర్పడింది అనుకుంట. నాకు యాక్షన్ సీన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో క్లైమాక్స్ ముఖ్యం. మొదట్లో చాలా మంది క్లైమాక్స్ సీన్స్‌పై సందేహాలు వ్యక్తం చేశారు. మొదటి సినిమాలోనే అంత బరువైన క్లైమాక్స్ ఎందుకని ప్రశ్నించారు. కానీ దర్శకుడు పట్టుబట్టి చేయించారు.

మా సినిమాలో మ్యూజిక్ బాగుంది. అన్ని పాటటు బాగా వచ్చాయి. ఇందులో క్లైమాక్స్ ఏ సినిమాలో వుండదు. చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ సీన్‌ను కాకినాడ ఉప్పాడ బీచ్‌లో తీశాం. చాలా బాగా వచ్చింది. ఇందులో తమిళ నటుడు శశి విలన్‌గా చేశాడు. ఆకట్టుకునే పాత్రల్లో దర్శకుడు దేవీప్రసాద్, రాజేశ్వరీ నాయర్, హీరోయిన్ అమ్మ పాత్రలో మణిచందన నటించారు. సీనియర్ నటుడు బెనర్జీ కూడా ముఖ్యమైన పాత్రలో చేశారు.

హీరోగా నటించాలని ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ని. చాలా మంది ‘ఎందుకు నీవు ఆఫీసుల చుట్టూ తిరగడం.. మీ మావయ్య అనుకుంటే… పెద్ద డైరెక్టర్లే ముందుకొస్తారు కదా? అన్నారు. కానీ నేనే సొంతంగా రాణించాలనే లక్ష్యంతో.. నేనే నిర్మాతలని, దర్శకులను మెప్పించి సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. అలా ప్రయత్నిస్తున్నప్పుడే చంద్రశేఖర్ కానూరి పరిచయం అయ్యారు.

మీరు హీరో కావాలంటే, బాగా స్లిమ్ అవ్వాలి అన్నారు. నేను బాగా ఫ్యాట్ గా వుండేవాణ్ని. దాంతో పది కిలోలు తగ్గి స్లిమ్ అయ్యా. ఫస్ట్ నా మీద ఓ ట్రయల్ షూట్ చేశారు. దాన్ని మామయ్యకు చూపించగానే బాగా చేశావన్నారు. ఆ తరువాత ఈ సినిమా కథ విని సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అన్నారు.  నిర్మాతలకు దర్శకుడే నన్ను పరిచయం చేశారు. అయితే వాళ్లు ఓ పెద్ద హీరోతో వెళితే బాగుంటుందనే ఆలోచనలో వుండగా దర్శకుడు నేనైతేనే ఈ సినిమాకి ఫిట్ అవుతానని చెప్పారు. దాంతో ఈ ప్రాజెక్టు పట్టాల మీదకు ఎక్కింది.

నేను రవితేజకి డైహార్డ్ ఫ్యాన్‌ని. ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎలా వుంటాయో మనందరికీ తెలుసు. ఇడియట్ సినిమాను చూసి సినిమాల్లోకి రావాలనుకున్నా. మా మావయ్య కమెడియన్ శ్రీనివాసరెడ్డి నీవే స్వతహాగా సినిమాల్లో రాణించాలనేవారు. దాంతో దాదాపు 8 ఏళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి, మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చినా హీరోగానే లాంఛ్ అవ్వాలని సినిమాను చివరకు విడుదల చేసేవరకు వచ్చినట్లు చెప్పారు సుజిత్ రెడ్డి.

ట్రెండింగ్ వార్తలు