ఆర్ఆర్ఆర్: జపాన్ లో RRR సందడి.. ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం..

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని, దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపించేందుకు సిద్దమవుతుంది.

ఆర్ఆర్ఆర్: జపాన్ లో RRR సందడి.. ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం..

Japan RRR Movie Promotions Start

ఆర్ఆర్ఆర్: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని, దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపించేందుకు సిద్దమవుతుంది.

NTR: జూనియర్ ఎన్టీఆర్ కి జపాన్ అభిమానుల లేఖ..

డ్రాగన్ దేశంలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు వెర్షన్ ని సబ్ టైటిల్స్ తో వీక్షించిన జపనీస్, దుబ్బింగ్ వెర్షన్ కోసం చాలా ఆతురతగా ఎదుచూస్తున్నారు. ఇక ఈ శుక్రవారం భారీస్థాయిలో సినిమాని విడుదల చేస్తుండగా, మూవీ టీం ప్రమోషన్స్ కోసం జపాన్ కి చేరుకుంది.

చిత్ర బృందంతో పాటు చరణ్ అండ్ ఎన్టీఆర్ ఫామిలీ మెంబెర్స్ కూడా డ్రాగన్ కంట్రీలో సందడి చేయనున్నారు. ఇక ఇవాళ జపాన్ మీడియా విలేఖర్లతో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ సమావేశం కాగా.. సినిమాకు సంబంధించిన పలు విషయాలను మీడియాతో ముచ్చటించారు. ఇక తారక్ అండ్ చరణ్ కి జపాన్ లో కూడా అభిమానులు ఉండడంతో, ఈ సినిమాకు మరింత కలిసి వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.