Jr NTR : చంద్రబాబు‌పై స్పందించని ఎన్టీఆర్.. అవార్డు కోసం దుబాయ్‌కి..

'దేవర' షూటింగ్ నుంచి విరామం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లారు. RRR లో నటనకు గాను ఉత్తమనటుడిగా ఎంపికైన ఎన్టీఆర్ సైమా అవార్డు అందుకోబోతున్నారు.

Jr NTR : చంద్రబాబు‌పై స్పందించని ఎన్టీఆర్.. అవార్డు కోసం దుబాయ్‌కి..

Jr NTR

Jr NTR : ‘దేవర’ షూటింగ్‌లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. సైమా అవార్డు అందుకోవడానికి ఫ్యామిలీతో కలిసి ఆయన దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించకపోవడం టీడీపీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

Natty Kumar: చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్‌తో సహా ఎవరూ స్పందించలేదు.. చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ ట్వీట్ చేస్తే చాలు 

కొరటాల శివ డైరెక్షన్‌లో ‘దేవర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్యామిలీతో కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. తన కొడుకులిద్దరితో పాటు సూట్ కేస్ పట్టుకుని ఎన్టీఆర్ కనిపించారు. ఫ్యామిలీతో కలిసి ఆయన దుబాయ్‌లో జరిగే సైమా అవార్డుల వేడుకలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.  RRR లో నటనకు గాను ఎన్టీఆర్‌ను ఉత్తమ నటుడిగా సైమా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దుబాయ్ పర్యటనలో ఎన్టీఆర్ ఈ అవార్డు అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టుపై సర్వత్రా వాడి వేడీ చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఎన్టీఆర్ ఇప్పటివరకూ నోరు మెదపలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఈ అంశం టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గకుండా వారికి కౌంటర్ ఇస్తున్నారు.

KA Paul: జూనియర్ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాకుండా వారు ఇలా చేస్తున్నారు: కేఏ పాల్

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఏప్రిల్ 5, 2024 థియేటర్లలో విడుదల కాబోతోంది. రీసెంట్ షెడ్యూల్‌లో నీటి అడుగున అద్భుతమైన సీన్ షూట్ చేసినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ ‘వార్ 2’ కూడా ఎన్టీఆర్ లిస్ట్‌లో ఉంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)