‘కె.జి.యఫ్ 2’.. రాకీ భాయ్ ఇండియన్ సినిమా హీరోయిజానికి బెంచ్ మార్క్ సెట్ చేశాడు ..

‘కె.జి.యఫ్ 2’.. రాకీ భాయ్ ఇండియన్ సినిమా హీరోయిజానికి బెంచ్ మార్క్ సెట్ చేశాడు ..

K.G.F 2 Teaser – 100 Million Views: మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ 2’ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 7వ తేది సాయంత్రం టీజర్ రిలీజ్ చేయగా అప్పటినుండి యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ వ్యూస్ వరద పారిస్తుంది. తాజాగా 100 మిలియన్ల మార్క్‌ని టచ్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఏ సినిమా టీజర్ కూడా ఈ స్థాయిలో వ్యూస్ రాబట్టలేదు. ఆ లెక్కన చూసుకుంటే రాకీ భాయ్ సెట్ చేసింది మామూలు రికార్డ్ కాదనే చెప్పాలి. ఇప్పటివరకు 102+ వ్యూస్, 5.3+ లైక్స్‌ రావడం విశేషం. టీజర్‌లో యష్ లుక్స్, మేనరిజమ్స్, విజువల్స్, ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీక్వెన్స్లు అదిరిపోయాయి. ముఖ్యంగా రాకీ భాయ్ సిగరెట్ వెలిగించే షాట్ అయితే మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ అని చెప్పాలి.

KGF 2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కె.జి.యఫ్. చాప్టర్ 2’ ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. వెండితెరపై ఇంతకుముందెన్నడూ చూడని కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అధీరాగా సంజయ్ దత్, రమీకా సేన్‌గా రవీనా టాండన్ కనిపించనున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక.. ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు, అచ్యుత్ కుమార్, మాళవికా అవినాష్, అయ్యప్ప పి.శర్చ, అర్చనా జోషి కీలకపాత్రల్లో కనిపించనున్నారు.