Samsung Price Cut : ఈ 3 కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్.. ఇలాంటి డీల్స్ మళ్లీ రావు.. డోంట్ మిస్!

Samsung : శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ల కొనేవారికి గుడ్ న్యూస్.. 3 ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Samsung Price Cut : ఈ 3 కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్.. ఇలాంటి డీల్స్ మళ్లీ రావు.. డోంట్ మిస్!

Samsung

Updated On : August 13, 2025 / 11:41 AM IST

Samsung Price Cut : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 FEలపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లతో లభ్యమవుతున్నాయి. ఈ కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ల ధర, ఫీచర్లు, ఆఫర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కొత్త ఫోల్డబుల్ ఫోన్లలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 FEలపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ అధికారిక ఇ-స్టోర్‌లో ఈ ఫోన్లపై భారీ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు పొందవచ్చు. ఈ ఆఫర్లతో ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌లను ఇప్పుడు గత ఫోన్ల కన్నా చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

మీరు గెలాక్సీ Z ఫోల్డ్ 7 లేదా గెలాక్సీ Z ఫ్లిప్ 7 కొనాలనుకుంటే.. ఇదే బెస్ట్ టైమ్.. HDFC, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఫుల్ పేమెంట్‌పై మీకు రూ. 12వేలు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో గెలాక్సీ Z ఫ్లిప్ 7 FEపై రూ. 10వేలు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు.. 24 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 12వేలు అప్‌గ్రేడ్ బోనస్, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూను కూడా అందిస్తుంది. అయితే, బ్యాంక్ డిస్కౌంట్, అప్‌గ్రేడ్ బోనస్‌ను కూడా అందిస్తుంది. అలాగే, పాత ఫోన్ వాల్యూ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. దాంతో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఈఎంఐ, నాన్-ఈఎంఐ లావాదేవీలపై 10శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది.

గెలాక్సీ ఫోన్ల కొత్త ధరలు ఇవే :
గెలాక్సీ Z ఫ్లిప్ 7 : రూ. 97,999
గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE : రూ. 85,999
గెలాక్సీ Z ఫోల్డ్ 7 : ప్రారంభ ధర రూ. 1,74,999.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఫీచర్లు :
6.5-అంగుళాల FHD+ అమోల్డ్ కవర్ స్క్రీన్ (120Hz), 8-అంగుళాల QXGA+ అమోల్డ్ ఇన్నర్ స్క్రీన్ (120Hz అడాప్టివ్) కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 16GB వరకు ర్యామ్, 1TB స్టోరేజ్ కలిగి ఉంది. పవర్ విషయానికి వస్తే.. ఫోన్ 4,400mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Google Pixel 10 Pro Fold : పిక్సెల్ ఫ్యాన్స్ కోసం కొత్త ఫోల్డబుల్ ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 20నే లాంచ్.. ఫుల్ డిటెయిల్స్..!

25W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది. కెమెరాల పరంగా ఫోన్ 200MP ప్రైమరీ, 12MP అల్ట్రా-వైడ్, 10MP టెలిఫోటో (3x ఆప్టికల్, 30x డిజిటల్ జూమ్) లెన్స్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 10MP కవర్, 10MP ఇన్నర్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఫీచర్లు :
6.9-అంగుళాల FHD+ అమోల్డ్ మెయిన్ స్క్రీన్ (120Hz), 4.1-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ స్క్రీన్ (120Hz) కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఎక్సినోస్ 2500 ప్రాసెసర్, 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీ ఉన్నాయి. పవర్ కోసం 4,300mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 ఉన్నాయి. కెమెరాల విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ, 12MP అల్ట్రా-వైడ్, 10MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE ఫీచర్లు (Samsung) :
6.7-అంగుళాల FHD + అమోల్డ్ మెయిన్ స్క్రీన్ (120Hz), 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ స్క్రీన్‌ కలిగి ఉంది. ఎక్సినోస్ 2400 ప్రాసెసర్, 8GB ర్యామ్, 256GB స్టోరేజీని కలిగి ఉంది. పవర్ కోసం ఈ ఫోన్ 4,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ కలిగి ఉంది.