Google Pixel 10 Pro Fold : పిక్సెల్ ఫ్యాన్స్ కోసం కొత్త ఫోల్డబుల్ ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 20నే లాంచ్.. ఫుల్ డిటెయిల్స్..!
Google Pixel 10 Pro Fold : పిక్సెల్ ఫోన్ అభిమానుల కోసం కొత్త ప్రో ఫోల్డ్ వెర్షన్ రాబోతుంది. ఆగస్టు 20 లాంచ్ చేసేందుకు గూగుల్ రెడీ అవుతోంది.

Google Pixel 10 Pro Fold
Google Pixel 10 Pro Fold : పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్.. గూగుల్ నెక్స్ట్ పిక్సెల్ లాంచ్ ఈవెంట్ వచ్చే వారం జరగనుంది. అయితే, అభిమానులకు (Google Pixel 10 Pro Fold) ఎంతగానో ఎదురుచూస్తున్న పిక్సెల్ ఫోన్లలో పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ రాబోతుంది. ఈవెంట్ సందర్భంగా గూగుల్ ఈ మడతబెట్టే ఫోన్ లాంచ్ చేయనుంది.
అయితే, అంతకన్నా ముందే పిక్సెల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ టీజర్ వీడియోను కంపెనీ షేర్ చేసింది. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ చూసేందుకు గత వెర్షన్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మాదిరిగానే ఉంది. ఇటీవలి లీక్‌లు కూడా ఈ ఫోన్ డిజైన్ వివరాలను రివీల్ చేశాయి.
30 సెకన్ల వీడియోలో పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ యాష్ కలర్ వంటి అన్ని ఫీచర్లను కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ లాంచ్‌కు సంబంధించి కూడా ఇదివరకే వెల్లడించింది. టీజర్ స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. కానీ, లీక్‌లను బట్టి ఏయే ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఉండనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఈ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ 6.4-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో వస్తుంది. 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 48MP మెయిన్ సెన్సార్, 10.5MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 10.8MP టెలిఫోటో కెమెరా ఉంటాయి. ఈ పిక్సెల్ ఫోన్ రెండు 10MP ఫ్రంట్ కెమెరాలతో వస్తుందని అంచనా.
అందులో బయటి డిస్‌ప్లే కోసం ఒకటి లోపలి ఫోల్డబుల్ స్క్రీన్ మరో డిస్‌ప్లే ఉంటుంది. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ టెన్సర్ G5 చిప్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 16GB ర్యామ్, 256GB, 512GB, 1TB స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. ఇంకా, ఈ పిక్సెల్ ఫోన్ 5,015mAh బ్యాటరీతో సపోర్టుతో పాటు IP68 రేటింగ్‌తో వస్తుందని అంచనా.