Redmi 15 Launch : కొత్త రెడ్‌మి 15 ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 19నే లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?
Redmi 15 Launch : కొత్త రెడ్‌మి ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. బ్యాటరీ, కెమెరా, ధరపై భారీ అంచనాలివే..

Redmi 15 Launch
Redmi 15 Launch : రెడ్‌మి లవర్స్ కోసం అతి త్వరలో కొత్త ఫోన్ రాబోతుంది. షావోబీ సబ్‌బ్రాండ్ వచ్చే వారం ఆగస్టు 19న భారత మార్కెట్లో రెడ్‌మి 15 ఫోన్ (Redmi 15 Launch) ఆవిష్కరించనుంది. అధికారిక లాంచ్‌కు ముందే కంపెనీ డిజైన్, స్పెసిఫికేషన్లు, బ్యాటరీ, కెమెరా సహా స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలను రివీల్ చేసింది.
రాబోయే స్మార్ట్‌ఫోన్ 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనా. అంతేకాదు.. భారీ బ్యాటరీతో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా రాబోతుంది. ఈ రెడ్‌మి 15 మొత్తం మిడ్‌నైట్ బ్లాక్, ఫ్రాస్టెడ్ వైట్, శాండీ పర్పుల్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. రెడ్‌మి 15కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
రెడ్‌మి 15 స్పెసిఫికేషన్లు (అంచనా) :
రెడ్‌మి 15 ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల FHD+ డిస్‌ప్లే కలిగి ఉంటుందని అంచనా. TUV రీన్‌ల్యాండ్ లో-బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సిర్కాడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్‌లు కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6S జెన్ 3 చిప్‌సెట్‌తో 33W ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ ఛార్జింగ్‌తో వస్తుంది.
Read Also : Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3పై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్!
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ రెడ్‌మి AI ఎరేస్, AI స్కై, క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్‌ల వంటి ఫీచర్లతో వస్తుంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని అంచనా. Redmi 15 లో IP64 ప్రొటెక్షన్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ-సర్టిఫైడ్ ఆడియో, 200 శాతం సూపర్ వాల్యూమ్ ఉన్నాయి. 2 ఏళ్ల OS+ 4 ఏళ్ల అవుట్-ఆఫ్-ది-బాక్స్ సెక్యూరిటీ అప్ డేట్స్‌తో HyperOS (ఆండ్రాయిడ్ 15)పై రన్ అవుతుంది.
భారత్‌లో రెడ్‌మి 15 ధర (అంచనా) :
రెడ్‌మి 15 బేస్ వేరియంట్ ధర దాదాపు రూ.19,999 ఉంటుందని అంచనా. ఈ బ్రాండ్ అధికారికంగా ధరను వెల్లడించలేదు. ఈ ఫోన్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. రెడ్‌మి 15 5G లాంచ్ తర్వాత Amazon.in, mi.com, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది.