Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3పై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్!
Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3పై అద్భుతమైన డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సహా అమెజాన్‌లో కూడా అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Nothing Phone 3
Nothing Phone 3 : కొత్త నథింగ్ ఫోన్ కావాలా? నథింగ్ బ్రాండ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 ధర భారీగా తగ్గింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ భారీ తగ్గింపుతో (Nothing Phone 3) లభ్యమవుతోంది. తాజాగా అమెజాన్‌లో కూడా అత్యధిక డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. వాస్తవానికి, ఈ నథింగ్ ఫోన్ 3 జూలై 1న రూ.79,999 ధరకు లాంచ్ అయింది.
ప్రస్తుతం అమెజాన్‌లో ధర రూ.55వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గ్లిఫ్ మ్యాట్రిక్స్‌తో వస్తుంది. మైక్రో ఎల్ఈడీలు, ట్రిపుల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ సహా ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఇంతకీ నథింగ్ ఫోన్ 3 ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 ధర :
ప్రస్తుతం నథింగ్ ఫోన్ 3 రూ.56,340 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర లాంచ్ ధర కన్నా రూ.23,659 తక్కువ. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్లు రూ.1500 బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. తద్వారా నథింగ్ ఫోన్ ధర రూ.54,840కి తగ్గుతుంది.
కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు. అది కూడా పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ.33,050 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఆసక్తిగల కస్టమర్లు నెలకు రూ. 2,718 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.
నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3 మోడల్ 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో HDR10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ నథింగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 కలిగి ఉంది.
16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ నథింగ్ ఫోన్ 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.