Kamal Haasan: ఇండియన్-2 కోసం 14 భాషల్లో దుమ్ములేపిన కమల్ హాసన్..?

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇండియన్-2’ మూవీపై కేవలం దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలోని ఓ పవర్‌ఫుల్ సీన్‌లో కమల్ హాసన్ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 14 భాషలను అనర్గళంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

Kamal Haasan: ఇండియన్-2 కోసం 14 భాషల్లో దుమ్ములేపిన కమల్ హాసన్..?

Kamal Haasan Speaks 14 Languages For Indian 2

Kamal Haasan: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇండియన్-2’ మూవీపై కేవలం దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండటం.. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తుండటంతో ‘ఇండియన్-2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలో కమల్ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ పవర్‌ఫుల్ సీన్‌లో కమల్ హాసన్ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 14 భాషలను అనర్గళంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. 10 నిమిషాలు సాగిన ఈ సీన్‌ను సింగిల్ షాట్‌లో కమల్ హాసన్ పూర్తి చేయడంతో చిత్ర యూనిట్ సభ్యులు జేజేలు కొట్టారట.

Kamal Haasan : రోబో2 తర్వాత ఆ ఫీట్ సాధించిన విక్రమ్..

ఈ విషయం తెలుసుకున్న కమల్ అభిమానులు ఈ సినిమాలోని ఆ సీన్ ఎప్పుడు వస్తుందా అని అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖణి, బాబీ సింహా, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.