KH233 : మెషిన్ గన్స్‌తో కమల్ హాసన్ స్పెషల్ ట్రైనింగ్.. వీడియో వైరల్..
హెచ్ వినోథ్ తో చేయబోయే KH233 మూవీ కోసం మెషిన్ గన్స్‌తో కమల్ హాసన్ స్పెషల్ ట్రైనింగ్..
KH233 : ‘విక్రమ్’ (Vikram) చిత్రంతో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్ (Kamal Haasan).. వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 (Indian 2) ని మొదలుపెట్టిన కమల్.. దానిని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక ఈ చిత్రంతో పాటు ప్రభాస్ కల్కి (Kalki2898AD) లో కూడా నటిస్తున్నాడు. అలాగే తమిళ్ దర్శకుడు హెచ్ వినోథ్ (H Vinoth) దర్శకత్వంలో తన 233వ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
కాగా దర్శకుడు హెచ్ వినోథ్.. గతంలో ఖాకి, వలిమై, తెగింపు వంటి యాక్షన్ సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పుడు కమల్ తో కూడా అలాంటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ నే తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా కమల్ హాసన్ మెషిన్ గన్స్‌తో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పలు మెషిన్ గన్స్ తో కమల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక వీడియోని మేకర్స్ ఆడియన్స్ కి షేర్ చేశారు. ఇక ఈ వీడియోతో మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. విక్రమ్ సినిమాలో కూడా కమల్ మెషిన్ గన్స్ తో చేసిన యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలైట్ గా నిలిచాయి.
Prashanth Neel : కుటుంబసభ్యుల పేరులతో పాటు ‘సలార్’ పేరుని కూడా.. ప్రశాంత్ నీల్ వీడియో వైరల్..
Guts & Guns ?
Training Begins #FuriousAction in #KH233#Ulaganayagan #KamalHaasan #RKFI52 #RISEtoRULE@ikamalhaasan #Mahendran #HVinoth@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/Mec86yIhlh
— Raaj Kamal Films International (@RKFI) September 7, 2023
ఇప్పుడు ఈ మూవీలో కూడా ఆ రేంజ్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. తన హోం బ్యానర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘రైజ్ టు రూల్’ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో నటించే నటీనటులు గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇండియన్ 2 షూటింగ్ దాదాపు పూర్తి అయ్యినట్లు సమాచారం ప్రస్తుతం ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఆ మూవీ రిలీజ్ డేట్ పై అనౌన్స్ రానుంది.