Devisri Prasad : దేవిశ్రీ ప్రసాద్‌పై కరాటే కళ్యాణి పోలీసులకి ఫిర్యాదు.. దేవిశ్రీ ప్రసాద్‌ ఆఫీస్‌ని ముట్టడిస్తాం అంటూ హెచ్చరిక..

. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కొన్ని రోజుల క్రితం ఓ పరి.. అనే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బంని రిలీజ్ చేశారు. పలు భాషల్లో ఈ పాటని గ్రాండ్ గా రిలీజ్ చేశారు దేవిశ్రీ. తాజాగా ఈ పాటలో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లా చూపించారని................

Devisri Prasad : దేవిశ్రీ ప్రసాద్‌పై కరాటే కళ్యాణి పోలీసులకి ఫిర్యాదు.. దేవిశ్రీ ప్రసాద్‌ ఆఫీస్‌ని ముట్టడిస్తాం అంటూ హెచ్చరిక..

devisri prasad

Devisri Prasad :  సినీ నటి కరాటే కళ్యాణి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి కరాటే కళ్యాణి మీడియా ముందుకి వచ్చింది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కొన్ని రోజుల క్రితం ఓ పరి.. అనే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బంని రిలీజ్ చేశారు. పలు భాషల్లో ఈ పాటని గ్రాండ్ గా రిలీజ్ చేశారు దేవిశ్రీ. తాజాగా ఈ పాటలో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లా చూపించారని ఆరోపిస్తూ దేవి శ్రీ ప్రసాద్ పై ఫైర్ అయింది కరాటే కళ్యాణి.

కరాటే కళ్యాణి, పలువురు హిందూ సంఘాలు కలిసి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై బుధవారం సాయంత్రం హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పవిత్రమైన హరే రామ హరే కృష్ణ మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను దేవిశ్రీ చిత్రీకరించాడని, హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని, హిందువులకి దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణ చెప్పాలని, పాటల్లో ఆ మంత్రాన్ని తొలిగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే దేవిశ్రీ పై చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి పోలీసులని కోరారు.

Anu Emmanuel : నాకు అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్ కాదు.. కెరీర్ స్టార్టింగ్ లోనే స్టార్స్ తో నటించా..

పాటలోని ఆ మంత్రాన్ని తొలిగించకపోతే దేవిశ్రీ ప్రసాద్ ఆఫీస్ ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది. మరి దీనిపై దేవిశ్రీప్రసాద్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.