Karthikeya 2 : చిన్న సినిమా.. పెద్ద విజయం.. 100 కోట్ల కార్తికేయ 2.. కర్నూల్ లో సెలబ్రేషన్స్..

కార్తికేయ 2 సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కేవలం 25 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పటికే 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దేశం మొత్తం అన్ని చోట్ల ఈ సినిమాకి.........

Karthikeya 2 : చిన్న సినిమా.. పెద్ద విజయం.. 100 కోట్ల కార్తికేయ 2.. కర్నూల్ లో సెలబ్రేషన్స్..

Karthikeya 2 movie 100 crores celebration

Karthikeya 2 :  నిఖిల్, చందూ మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. ఇక నార్త్ లో అయితే కేవలం 50 థియేటర్లలో రిలీజ్ అయి మూడు రోజులోనే 1000 కి పైగా థియేటర్లకు పెరిగింది అంటే ఎంత భారీ హిట్ కొట్టిందో అర్ధమవుతుంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకి మంచి విజయం లభించింది.

కార్తికేయ 2 సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కేవలం 25 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పటికే 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దేశం మొత్తం అన్ని చోట్ల ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా 100 కోట్లకు దూసుకుపోతుంది. దీంతో చిత్ర యూనిట్ భారీ సెలబ్రేషన్స్ ని నిర్వహించబోతున్నారు.

Aditi Shankar : వైట్ శారీలో అదరగొట్టిన డైరెక్టర్ శంకర్ కూతురు.. హీరోయిన్ అదితి శంకర్

నేడు శుక్రవారం ఆగస్టు 26న కర్నూలులో కార్తికేయ 2 సినిమా 100 కోట్ల సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా రానున్నారు. చిన్న సినిమా ఇంత భారీ విజయం సాధించడంతో నిఖిల్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.