Katrina Kaif : అందుకే మా పెళ్లిని సీక్రెట్ గా చేసుకున్నాం.. తన పెళ్లి గురించి మొదటిసారి మాట్లాడిన కత్రినా కైఫ్..

కత్రినా మాట్లాడుతూ..''కరోనా సమయంలో నా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. మా ఫ్యామిలిలో అందరం కరోనా బారిన పడ్డాము. వారి విషయంలో నేను మళ్ళీ రిస్క్ చేయదలుచుకోలేదు. అందుకే ఎలాంటి..........

Katrina Kaif : అందుకే మా పెళ్లిని సీక్రెట్ గా చేసుకున్నాం.. తన పెళ్లి గురించి మొదటిసారి మాట్లాడిన కత్రినా కైఫ్..

Katrina Kaif spoke first time about her marriage

Katrina Kaif :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తనకన్నా చిన్నవాడైన, యువ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముందు నుంచి వీళ్ళ పెళ్లి గురించి ఎలాంటి సమాచారం బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడి సడెన్ గా చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్ లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ పెళ్లి చాలా తక్కువ మంది మధ్యలో ఘనంగా జరిగింది. పెళ్లి లోపలికి ఫోన్లని కూడా తీసుకువెళ్లనివ్వలేదు. అంత జాగ్రత్తగా పెళ్లిని ఎవరికీ తెలియకుండా చేసుకున్నారు.

ఆ తర్వాత రోజు కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి తమ పెళ్లి జరిగిందని అభిమానులకి, ప్రేక్షకులకి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ తర్వాత వీరిద్దరూ హనీమూన్ వెళ్లి వచ్చారు, షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత కత్రినా ఒక్కసారి కూడా తన మ్యారేజ్ గురించి మాట్లాడలేదు. తాజాగా ముంబైలో 67వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమానికి భర్త విక్కీ కౌశల్ తో కలిసి వచ్చి సందడి చేసింది కత్రినా.

Vaishnav Tej : కళ్యాణ్ మామయ్య ‘బద్రి’ సినిమా రీమేక్‌లో నటించాలనుంది..

ఈ కార్యక్రమం అనంతరం దీనికి సంబంధించి జూమ్ కాల్ లో మాట్లాడుతూ మొదటిసారి కత్రినా తన పెళ్లి గురించి మాట్లాడింది. కత్రినా మాట్లాడుతూ..”కరోనా సమయంలో నా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. మా ఫ్యామిలిలో అందరం కరోనా బారిన పడ్డాము. వారి విషయంలో నేను మళ్ళీ రిస్క్ చేయదలుచుకోలేదు. అందుకే ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే మా పెళ్లిని చాలా సీక్రెట్ గా చేసుకున్నాం. మాకు, మా ఫ్యామిలీకి చాలా దగ్గరి వాళ్ళని మాత్రమే పెళ్ళికి పిలిచాం. అతి తక్కువ మంది మధ్యలో మా వివాహం జరిగింది. సింపుల్ గా జరిగినా చాలా బాగా జరిగింది. మా పెళ్లిని సీక్రెట్ గా చేసుకోవడానికి కరోనా భయమే కారణం. అసలు అలాంటి పాండమిక్ సమయంలో మా పెళ్లి జరిగింది అంటే గొప్ప విషయమే” అని తెలిపింది.