Manchu Vishnu : ప్రెసిడెంట్ సర్ వెరీ నాటీ అంటున్న సన్నీలియోన్.. స్టేజిమీదే ముద్దు పెట్టనా అని అడిగిన మంచు విష్ణు…

తాజాగా జిన్నా సినిమా నుంచి టీజర్ ని లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా సినిమాకి పనిచేసిన వాళ్లంతా విచ్చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అందరూ చాలా సరదాగా మాట్లాడారు. ఈవెంట్లో ఓ విలేఖరి సన్నీ లియోన్ ని..........

Manchu Vishnu : ప్రెసిడెంట్ సర్ వెరీ నాటీ అంటున్న సన్నీలియోన్.. స్టేజిమీదే ముద్దు పెట్టనా అని అడిగిన మంచు విష్ణు…

Manchu Vishnu asked kiss to Sunny Leone on stage

Manchu Vishnu :  మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా సన్నీలియోన్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న సినిమా జిన్నా. చాలా రోజుల తర్వాత మంచు విష్ణు ఫుల్ మాస్, కామెడీ, కమర్షియల్ సినిమాతో రాబోతున్నాడు. కోన వెంకట్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాయగా, కొత్త దర్శకుడు ఈషాన్‌ సూర్య తెరకెక్కిస్తుండగా మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు.

తాజాగా జిన్నా సినిమా నుంచి టీజర్ ని లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా సినిమాకి పనిచేసిన వాళ్లంతా విచ్చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అందరూ చాలా సరదాగా మాట్లాడారు. ఈవెంట్లో ఓ విలేఖరి సన్నీ లియోన్ ని ఈ కథ ఒప్పుకోవడానికి అసలు కారణం ఏంటి అని అడగగా సన్నీ లియోన్ మాట్లాడుతూ.. ఇది చాలా కొత్త కథ, ట్విస్ట్ బాగుంటుంది. ఇలాంటి కథని నేను ఇప్పటిదాకా చెయ్యలేదు. అంతే కాకుండా మంచు విష్ణు కోసం ఈ సినిమా చేస్తున్నాను. విష్ణు చాలా మంచి వాడు అని చెప్పింది.

Regina Cassandra : పెళ్లి చేసుకుంటానో లేదో తెలీదు.. నా ప్రేమ 2020 లోనే ముగిసిపోయింది

దీంతో మంచు విష్ణు స్టేజి మీదే.. అయితే నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని సన్నీలియోన్ ని అడిగాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. దీంతో సన్నీ లియోన్ విష్ణు చాలా నాటీ. మీకు కూడా తెలుసు అనుకుంట అని అంది. దీంతో ఈ వీడియో వైరల్ గామారింది. ఇక మంచు విష్ణు ఎప్పుడు ఏ విషయంలో దొరికినా సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రెసిడెంట్ సర్ వెరీ నాటీ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.